దెబ్బకు దెబ్బ తీస్తాం : నాలో కూడా అంతే ఆగ్రహం ఉంది

  • Published By: venkaiahnaidu ,Published On : February 17, 2019 / 10:53 AM IST
దెబ్బకు దెబ్బ తీస్తాం : నాలో కూడా అంతే ఆగ్రహం ఉంది

పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్నా మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ..పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భగల్ పూర్ కి చెందిన  రతన్ కుమార్ ఠాకూర్, పాట్నాకి చెందిన సంజయ్ కుమార్ సిన్హాకు  నివాళులర్పిస్తున్నాను. దేశం కోసం వారు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మీలో ఎంతటి ఆగ్రహం ఉందో..నా హృదయంలోనూ అంతే ఆగ్రహం ఉంది అని అన్నారు.

కాగా  బీహార్ రాష్ట్రాన్ని, అదే విధంగా తూర్పు భారతదేశాన్ని అభివృద్ధి చెయ్యాలన్న లక్ష్యంతో తాము ప్రారంభిన అనేక ప్రాజెక్ట్స్ లో పీఎమ్ ఉర్జా గంగా యోజన ఒకటని మోడీ అన్నారు. ఈ స్కీమ్ ద్వారా యూపీ,బీహార్,వెస్ట్ బెంగాల్, జార్ఖండ్,ఒడిషా రాష్ట్రాలు గ్యాస్ పైప్ లైన్స్ ద్వారా కనెక్ట్ అయ్యాయని తెలిపారు.