Modi US Tour : అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ..నేడు కమలాహారిస్ తో భేటీ

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో అడుగుపెట్టారు. జోరుగా వర్షం పడుతున్నా ఎన్‌ఆర్‌ఐలు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహ్యారిస్‌తో భేటీ కానున్నారు.

Modi US Tour : అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ..నేడు కమలాహారిస్ తో భేటీ

Modi (3)

Updated On : September 23, 2021 / 8:49 AM IST

PM Modi meet Kamala Harris : ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో అడుగుపెట్టారు. జోరుగా వర్షం పడుతున్నా.. ప్రధాని కోసం వేచి చూసిన ఎన్‌ఆర్‌ఐలు ఘన స్వాగతం పలికారు. తనకు స్వాగతం చెప్పేందుకు వచ్చిన ప్రతీ ప్రవాస భారతీయుడిని పలకరిస్తూ.. అందరితో కరచాలనం చేశారు. నేటి నుంచి 25 వరకు.. మూడ్రోజులపాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు భారత ప్రధాని. 2019 తర్వాత తొలిసారి అమెరికా వచ్చిన ప్రధాని.. న్యూయార్క్, వాషింగ్టన్‌లో పర్యటిస్తారు. బ్యాక్‌ టు బ్యాక్‌ మీటింగులతో బిజీబిజీగా గడపనున్నారాయన.

ఇవాళ అక్కడి ప్రముఖ సంస్థలకు చెందిన సీఈవోలతో సమావేశమవుతారు. ఐదుగురు టాప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌తో ముఖాముఖి సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. అందులో ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్ కూడా ఉండే అవకాశం ఉంది. మిగతా నలుగురు ఎవరన్నది ఇంకా ఫైనల్‌ కాలేదు. ఆ తర్వాత అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహ్యారిస్‌తో భేటీ అయ్యి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌, జపనీస్ ప్రధాని యోషియిడే సుగాలతో సమావేశంకానున్నారు ప్రధాని మోదీ.

Modi in America : ఇద్దరు ప్రధానులు, ఐదుగురు సీఈవోలతో మోదీ కీలక సమావేశాలు

రేపు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో భేటీకానున్నారు ప్రధాని మోదీ. ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక.. అదేరోజు వైట్‌హౌస్‌లో జరిగే క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోను మోదీ పాల్గొంటారు. ఈ సదస్సులో అఫ్ఘానిస్తాన్ పరిణామాలు, ఇండో-పసిఫిక్‌ అజెండా, కోవిడ్‌-19, వాతావరణ మార్పులు వంటి అంశాలు చర్చకు రావచ్చు. అదేరోజు బైడెన్‌ ఇచ్చే డిన్నర్‌కు హాజరై.. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళతారు.

ఇక పర్యటనలో చివరిరోజు అయిన ఎల్లుండి.. న్యూయార్క్ లో జరిగే 76వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు మోదీ. కరోనా, ఉగ్రవాదం అంశాలను ప్రస్తావించనున్నారు. అఫ్ఘానిస్తాన్ పరిణామాలపై మనదేశ వైఖరిని అక్కడే ప్రకటించే అవకాశం ఉంది. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపైనా చర్చించే అవకాశం ఉంది. U.N.లో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి కూడా ప్రస్తావించనున్నారు.