Rahul Gandhi: వినూత్న బ్యాగుతో పార్లమెంటుకు ప్రియాంక.. రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్స్.. వీడియో వైరల్

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల రగడ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ..

Rahul Gandhi: వినూత్న బ్యాగుతో పార్లమెంటుకు ప్రియాంక.. రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్స్.. వీడియో వైరల్

Priyanka gandhi

Updated On : December 10, 2024 / 12:15 PM IST

Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల రగడ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనపై జేపీసీ విచారణ చేపట్టాలంటూ గత కొన్నిరోజులుగా పార్లమెంటు లోపల, వెలుపల విపక్ష సభ్యులు ఆందోళ చేస్తున్న విషయం తెలిసిందే. మంగళవారంసైతం విపక్ష పార్టీల సభ్యులు తమ నిరసనను కొనసాగించారు.

Also Read: SM Krishna: ఎస్ఎం కృష్ణ మృతిపట్ల మోదీ, చంద్రబాబు సంతాపం.. గతంలో ఫొటోలను షేర్ చేసిన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ, అదానీ చిత్రాలతో పాటు ‘మోదీ అదానీ భాయ్ భాయ్’ నినాదాలతో ముద్రించిన బ్యాగులు చేత్తో పట్టుకొని పార్లమెంటు వద్ద కాంగ్రెస్, విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ప్రియాంక చేతిలోని ఆ బ్యాగును పరిశీలించి ‘చూడండి ఎంత క్యూట్ గా ఉందో’ అంటూ రాహుల్ పేర్కొన్నారు. ఆ బ్యాగ్ పై ఒకవైపు మోదీ, మరోవైపు అదానీ బొమ్మ ఉంది. మోదీ అదానీ భాయ్ భాయ్ అని రాసిఉంది. ఇంతలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. సభా కార్యక్రమాల్లో మేం పాల్గొనాలనుకుంటున్నాం. కానీ, ప్రభుత్వం చర్చను కోరుకోవడం లేదని అన్నారు. ఏదో ఒక సాకుతో సభా కార్యక్రమాలను వాయిదా వేస్తున్నారని ప్రియాంక అన్నారు.