యూపీలో పోస్టర్ల కలకలం: ప్రియాంక రాక్షసి.. బీజేపీ ఎంపీ దేవత

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాపై తీవ్రంగా విమర్శలు దిగుతోంది బీజేపీ. బీజేపీ కార్యకర్తల ఆగడాలకు హద్దూ ఆపూ లేకుండా పోతుంది. ప్రియాంక గాంధీని రాక్షసుడితో పోలుస్తూ బీజేపీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్‌ను దుర్గా దేవీతో చిత్రీకరించారు. క్షణాల్లో వార్త మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆ ఎంపీ మాత్రం చల్లగా ఇలా చేసిందెవరో తెలుసుకుని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది.
రాజకీయాలంటే పొగడ్తలతో పాటు విమర్శలకు కూడా సిద్ధంగా ఉండాల్సిందే. గత వారం ప్రియాంక గాంధీని మణికర్ణికగా పోలుస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు పెట్టారు. గోరఖ్‌పూర్ నుంచి 2019లోక్ సభ ఎన్నికలకు పోటీ చేస్తున్న సందర్భంగా ఆమెను ఇలా చిత్రకిరీస్తూ పోస్టర్లు పెట్టారు. ఇంకో పోస్టర్లో ప్రియాంకను రాణి ఝాన్సీ లక్ష్మీ భాయ్‌గా గుర్రపు స్వారీ చేస్తున్న బొమ్మను పెట్టారు. దాంతో పాటు ‘నలు దిక్కులా ప్రియాంక విజయ డంకా మోగి తీరాల్సిందే’, ‘దేశమంతా ఇప్పుడు అరవాలి.. ఈ సారి కాంగ్రెస్ రావాలి’ అంటూ నినాదాలతో పోస్టర్లు సిద్ధం చేశారు.