కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు గా సోనియా,ప్రియాంక

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2019 / 03:19 PM IST
కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు గా సోనియా,ప్రియాంక

Updated On : March 26, 2019 / 3:19 PM IST

లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ అధికశాతం సీట్లను గెల్చుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ 40 మంది హేమాహేమీలను ప్రచార బరిలోకి దింపనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ల జాబితాను ఆ పార్టీ మంగళవారం(మార్చి-26,2019) విడుదల చేసింది.స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సోనియా గాంధీ కూడా ఉన్నారు.  మహారాష్ట్రలో అధికార బీజేపీ-శివసేన కూటమితో ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి తలపడుతోంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ,మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్,జ్యోతిరాదిత్య సింధియా, మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్ తదితర నేతలు స్టార్ క్యాంపెయినర్ల  జాబితాలో ఉన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎంలుఅశోక్ చవాన్, పృధ్వీరాజ్ చవాన్‌ లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు గాను ఏప్రిల్- 11,2019న ప్రారంభమై మొదటి నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి.