వాషింగ్ మెషీన్‌లో డబ్బుల కట్టలు.. వాటిని ఉతకడానికి పెట్టారా ఏంటీ?

Washing Machine: వాషింగ్ మిషన్‌లో బట్టలను చూస్తాం. వాటిని ఉతకడానికి పెట్టారని మనకు అర్థమైపోతుంది. మరి డబ్బులను ఎవరైనా ఉతుకుతారా?

వాషింగ్ మెషీన్‌లో డబ్బుల కట్టలు.. వాటిని ఉతకడానికి పెట్టారా ఏంటీ?

Washing Machine

వాషింగ్ మెషీన్‌లో డబ్బుల కట్టలను దాచిపెట్టారు అక్రమార్కులు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన సోదాల్లో ఈ విషయం బయటపడింది. సోదాల్లో భాగంగా ఇళ్లలో అన్నింటినీ చెక్ చేస్తున్న అధికారులు వాషింగ్ మిషన్ ను తెరవగానే అందులో డబ్బుల కట్టలు కనపడ్డాయి.

నగదు అక్రమ చలామణీ కేసులో ఈడీ తాజాగా క్యాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లక్ష్మీటన్ మారిటైమ్, హిందుస్థాన్ ఇంటర్నేషనల్, రాజనందిని మెటల్స్ లిమిటెడ్ సహా పలు కంపెనీలు, వాటి డైరెక్టర్ల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపింది. ఒకే రోజులో రూ.2.5 కోట్లు స్వాధీనం చేసుకుంది. అందులోని కొంత మొత్తం వాషింగ్ మిషన్‌లో దొరికింది.

విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఆయా కంపెనీల డైరెక్టర్లు ఉల్లంఘించారన్న అభియోగాలపై వ్యాపారవేత్తలు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, సందీప్ గార్గ్, వినోద్ కేడియా వంటి వారి ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి.

కొన్ని రోజుల నుంచి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, హరియాణాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. రూ.1,800 కోట్ల చెల్లింపుల విషయంలో ఆరోపణలు ఉన్నాయి. పలు డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 47 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. వాషింగ్ మిషన్‌లో బట్టలను చూస్తాం. వాటిని ఉతకడానికి పెట్టారని మనకు అర్థమైపోతుంది. మరి డబ్బులను ఎవరైనా ఉతుకుతారా? అక్రమార్కులు డబ్బులు దాచి పెట్టుకోవడానికి ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.