అసలు తప్పెక్కడ: పుల్వామా దాడిపై సిద్దు ఏమన్నాడు?

భారత్‌లో 2019 ఫిబ్రవరి 14 కల్లోలాన్ని సృష్టించింది. పూల్వామా దాడి 49మంది జవాన్ల ప్రాణాలను బలిగొంది. పుల్వామా జిల్లాలోని అవంతిపుర ప్రాంతంలో జరిగిన దాడి పట్ల యావత్ భారతదేశమంతా ఆగ్రహజ్వాలల్లో రగిలిపోతుంది. దేశాధిపతి దగ్గర్నుంచి ఉన్నతాధికారులు, సగటు భారతీయుడు సైతం పాక్‌పై కోపంతో ఊగిపోతున్నారు. పాక్‌కు చెందిన నిషేదిత ఉగ్రవాద సంస్థలో భాగమైన జైషే మొహమ్మద్ ఈ దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు కావడంతో పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
వీటన్నిటికీ భిన్నంగా టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ పట్ల సానుకూలంగా స్పందించాలంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు నవ్‌జోత్‌ను దేశం నుంచి వెలివేయాలంటూ విమర్శలు సంధిస్తున్నారు. అసలు సింగ్ అలా మాట్లాడటానికి కారణమేంటి? అంతవివాదంగా మాట్లాడాడంటే..
‘కేవలం ఏ ఒక్కరో చేసినపనికి దేశమంతటిని నిందించడం సబబుకాదు. నేను ఒప్పుకుంటున్నాను. ఇది కేవలం పిరికిపంద చర్య. హింస అనేది ఎప్పుడూ ఖండించాల్సిన విషయమే. ఎవరుచేసినా దానికి శిక్ష విధించాల్సిందే’ అని వ్యాఖ్యానించాడు. నవ్‌జోత్ చెప్తున్న మాటలు కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ, సందర్భరహితంగా నోరు జారడమనేది తప్పుడు చర్యే.
మారణకాండ జరిగి దేశమంతా దిగ్భ్రాంతిలో ఉన్న సమయంలో ‘ఒక్కడే తప్పు చేశాడు. మిగిలనవాళ్లంతా మంచోళ్లంటూ’ వ్యాఖ్యలు చేయడం నెటిజన్ల ఆగ్రహానికి బలైయ్యేందుకు మరో అవకాశాన్నిచ్చింది. ఇటీవలే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ హాజరవడంతో నెటిజన్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Read Also : సాలే, ఇక్కడెందుకున్నావ్ రా? పాకిస్థాన్‌కి పో..
Read Also : సెహ్వాగ్ సేవాగుణం: వీరజవాన్ల పిల్లలను చదివిస్తా