పుల్వామా అమరుల కోసం : సచిన్ ‘పుష్-అప్స్’

  • Published By: madhu ,Published On : February 25, 2019 / 02:10 AM IST
పుల్వామా అమరుల కోసం : సచిన్ ‘పుష్-అప్స్’

Updated On : February 25, 2019 / 2:10 AM IST

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తోంది. వారికి సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. ఇందులో సామాన్యుడి నుండి రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన వారున్నారు. తమవంతు సహకారం అందిస్తూ దాతృత్వం చాటుతున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ముందుకొచ్చాడు. ఓ ఈవెంట్‌లో సచిన్ పాల్గొన్నాడు. ఇందులో వచ్చిన రూ. 15 లక్షల నిధులను సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందచేస్తామని ఈవెంట్ నిర్వాహకులు వెల్లడించారు. 

జవహార్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఫిబ్రవరి 24వ తేదీ ఆదివారం సచిన్ 10 పుష్ అప్స్ ఎక్సర్ సైజ్ చేశాడు. అంతేగాకుండా మారథాన్‌లో పరుగులు పెట్టాడు. బ్యాటింగ్‌తో అలరించాడు. మొత్తంగా రూ. 15 లక్షలు పోగయ్యాయి. ఈ మొత్తాన్ని ఇటీవలే ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందచేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాట్లాడుతూ…ఓ మంచి పని కోసం నిధులను సేకరిస్తున్నారని, ప్రజలంతా ఇందులో భాగం కావాలని పిలుపునిచ్చాడు. పెద్దలతో పాటు ఉత్సాహంగా పరుగెత్తడానికి వచ్చిన బాల బాలికలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. రాబోయే తరం మీదే..జాతిని నడిపించేది మీరే..ఇలాంటి ఆరోగ్యకర వాతావరణంలో భారత్‌ను క్రీడలు ఆడే దేశంగా మార్చాలని సూచించారు. టెండూల్కర్ ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.