12 గంటల్లోనే ఏరిపారేశారు: పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం

పుల్వామా ఉగ్రదాడి ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఈ-మహ్మద్ కు చెందిన టాప్ టెర్రరిస్ట్ ను భారత బలగాలు మట్టుబెట్టాయి.

  • Published By: sreehari ,Published On : February 18, 2019 / 02:26 PM IST
12 గంటల్లోనే ఏరిపారేశారు: పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం

Updated On : February 18, 2019 / 2:26 PM IST

పుల్వామా ఉగ్రదాడి ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఈ-మహ్మద్ కు చెందిన టాప్ టెర్రరిస్ట్ ను భారత బలగాలు మట్టుబెట్టాయి.

పుల్వామా ఉగ్రదాడి ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌ కు చెందిన టాప్ టెర్రరిస్ట్ ను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భారత CRPF జవాన్లపై ఉగ్రదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్ పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు.

ఉగ్రకుట్రకు ప్లాన్ చేసిన ఇద్దరు ఉగ్రవాదుల్లో సూత్రధారి కమ్రాన్ ను ఆర్మీ బలగాలు హతమార్చాయి. పుల్వామా ఉగ్రదాడి జరిగిన ఘటనా స్థలానికి 10 కిలోమీటర్ల దూరంలో భద్రత బలగాలు ఎన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించగా, ఉగ్రవాది కమ్రాన్ హతమయ్యాడు. జైషే చీఫ్ మౌలానా మసూద్ అజహర్ కు సన్నిహితుడిగా భారత ఆర్మీ అనుమానిస్తోంది. 

పుల్వామా ఉగ్రదాడి ఘటన జరిగినప్పటి నుంచి భారత భద్రత బలగాలు ఎన్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. 12 గంటల్లోనే మరో టాప్ జైషే ఉగ్రవాది హిలాల్ అహ్మద్ అనే స్థానిక బాంబు స్పెషలిస్ట్ ను ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాదిని కూడా పోలీసులు హతమార్చగా.. గుర్తించాల్సి ఉంది. వాంటెడ్ టెరర్రిస్టులను ఏరివేస్తున్న క్రమంలో జవాన్లను కూడా కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. .

ఈ ఎన్ కౌంటర్ ఆపరేషన్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఒక పోలీసు అమరులయ్యారు. హతమైన టెర్రరిస్టుల ఫొటోలను కూడా సెక్యూరిటీ ఏజెన్సీలు విడుదల చేశాయి. రిలీజ్ చేసిన ఫొటోలో కమ్రాన్.. AK-47 రిఫైల్ తో ఉన్నాడు. కశ్మీర్ లోయలో యువకులను ట్రాప్ చేసి ఉగ్రవాదులుగా రిక్రూట్ చేసుకొని వారికి ట్రైనింగ్ ఇస్తున్నట్టు గుర్తించారు.