Auto Driver dance..movie chance : ఒక్క డ్యాన్స్ వీడియోతో సినిమా ఛాన్స్ కొట్టేసిన ఆటో డ్రైవర్

Auto Driver dance..movie chance : ఒక్క డ్యాన్స్ వీడియోతో సినిమా ఛాన్స్ కొట్టేసిన ఆటో డ్రైవర్

Cinema Opportunity For An Auto Driver With A Single Dance

Updated On : March 17, 2021 / 3:58 PM IST

Cinema opportunity for auto driver : చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచ అంతా ముంగిట్లోనే ఉంటుంది. అలాగే టాలెంట్ ఉంటే దాన్ని ప్రదర్శించుకోవటానికి పెద్ద పెద్ద వేదికలే ఉండనక్కరలేదు. ఒక్క సోషల్ మీడియా చాలు. టాలెంట్ తో రాత్రికిరాత్రే స్టార్లు అయిపోవచ్చు. టాలెంట్ తో ఒక్క డాన్స్ తో.. ఒక్క పాట.సోషల్ మీడియా స్టార్లు అయిపోవచ్చు. పెద్ద తెరపై కూడా వెలిగిపోవచ్చు. ఒక్క రోజులో సెలబ్రిటీని చేసి కూర్చుండబెడతాయి సోషల్ మీడియాలో వచ్చే లైకులు, షేర్లు, కామెంట్లతో. ఓ ఆటో డ్రైవర్ అలాగే ఒకే ఒక్క రోజులో ఒక్క డ్యాన్స్ వీడియోతో సెలబ్రిటీ అయిపోయాడు. ఏకంగా మరాఠి మూవీలో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు.

మహారాష్ట్ర, పుణె సిటీకి దగ్గరలోని బారామతి తాలుకాకు చెందిన బాబాజి కాంబ్లే అనే ఆటో‌డ్రైవర్ కు డ్యాన్స్ అంటే ప్రాణం. డ్యాన్స్ తో పాటు చక్కటి ముఖాభినయం కూడా కాంబ్లే సొంతం. చక్కటి డ్యాన్సులతో..నటనతో తోటి ఆటో డ్రైవర్లను రంజింపజేస్తుంటాడు. తన ఆటతో ఆనందింపజేస్తుంటాడు.అలా ఓ రోజున ఆటో స్టాండ్ లో తన నటనకు పనిచెప్పాడు.

ఇటీవలే తన తోటి ఆటోడ్రైవర్ల ఎదుట ‘మల జావు ధ్యానా ఘరి’ అనే పాటకు మహారాష్ట్ర పాపులర్ డ్యాన్స్ ‘లవని’ స్టైల్‌లో పర్ఫార్మ్ చేసి ఫిదా చేశాడు. ఆ పాటకు అచ్చం సినిమా హీరోలా చేసిన ఆయన డ్యాన్స్ వీడియోను అతడి స్నేహితులు నెట్టింట షేర్ చేయగా, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఆ ఒక్క వీడియోతో కాంబ్లే సెలబ్రిటీ అయిపోయాడు. ఈ వీడియోను మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేయడం విశేషం.ఈ ట్రెండింగ్ వీడియో చూసిన మరాఠి ఫిల్మ్ డైరెక్టర్ ఘన్‌శ్యామ్ విష్ణు‌పంత్ యేడే తన సినిమాలో నటించాలని కాంబ్లేకు ఆఫర్ కూడా ఇచ్చారు. దీంతో కాంబ్లే ఉబ్బి తబ్బిబైపోతున్నాడు. ఇక సినిమాలో ఆఫర్ లభించడంతో ఆటో డ్రైవర్ కాంబ్లే తెగ సంబరపడిపోతున్నారు.