Honey-Trapping Racket: రిటైర్డ్ ఐఏఎఫ్ అధికారిని బ్లాక్ మెయిల్.. హనీట్రాప్
హనీట్రాప్ కేసులో పూణె సిటీ పోలీసులు రెండ్రోజుల్లోనే మరో నలుగురిని అరెస్ట్ చేశారు. 59సంవత్సరాల వయస్సున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని బ్లాక్ మెయిల్..

Honey Trap
Honey-Trapping Racket: హనీట్రాప్ కేసులో పూణె సిటీ పోలీసులు రెండ్రోజుల్లోనే మరో నలుగురిని అరెస్ట్ చేశారు. 59సంవత్సరాల వయస్సున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని బ్లాక్ మెయిల్ చేస్తుండగా దొరికిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
సొంతగా వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తికి కొద్ది రోజుల క్రితం మహిళ నుంచి ఫోన్ వచ్చింది. ఆర్తి చౌదరి అని తనను పరిచయం చేసుకున్న ఆమె.. ఉద్యోగం కావాలని అడిగింది. తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలని కోరినా రిటైర్డ్ ఐఏఎఫ్ అధికారి చేయలేకపోయాడు.
‘అయినప్పటికీ ఆ మహిళ అతనితో టచ్ లోనే ఉంది. ఫోన్ మెసేంజర్ లో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. పూణెలోని నారాయంగాం ప్రాంతంలో కలుద్దామని చెప్పింది. గుర్తు తెలియని లొకేషన్ కు తీసుకెళ్లేసరికి వేరే వ్యక్తులు వచ్చి బెదిరించడం మొదలుపెట్టారు. తాము మహిళ తరపు బంధువులమని చెప్తూ.. బెదిరింపులకు దిగారు.
ఆమె నుంచి రూ.50లక్షల వరకూ డిమాండ్ చేశారు. బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేయడం మాత్రమే కాదు హాని చేయడానికి ప్రయత్నించారు. అని విమంతల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ భరత్ జాదవ్ చెప్పారు.
వీరి నుంచి తప్పించుకోవడానికి ఒక్కో దానిలో రూ.10లక్షల వరకూ రాసి మూడు చెక్ లు ఇచ్చానని బాధితులు చెప్తున్నాడు. మంగళవారం పోలీసులను కలిసి తన బాధ మొత్తం చెప్పుకుని.. తన కోసం వెదుకుతున్నారని చెప్పడంతో కేసు నమోదైంది. ఇప్పటి వరకూ ఒక చెక్ డ్రా చేయగా దాని ఆధారంతో నలుగుర్ని పట్టుకోగలిగారు. కీలక వ్యక్తి అయిన మహిళను కూడా త్వరలోనే పట్టుకుంటామని’ పోలీసులు అంటున్నారు.