PM Modi To Punjab: రెండేళ్ల తర్వాత పంజాబ్ కు మోదీ..భారీగా భద్రత

మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో బుధవారం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కాగా,రెండేళ్ల తర్వాత పంజాబ్ లో మోదీ కాలుమోపనున్నారు. పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా

PM Modi To Punjab: రెండేళ్ల తర్వాత పంజాబ్ కు మోదీ..భారీగా భద్రత

Modi (1)

Updated On : January 4, 2022 / 9:43 PM IST

Punjab Election : మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో బుధవారం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కాగా,రెండేళ్ల తర్వాత పంజాబ్ లో మోదీ కాలుమోపనున్నారు. పంజాబ్‌లోని సరిహద్దు జిల్లా అయిన ఫిరోజ్‌పూర్ లో పర్యటించనున్న మోదీ.. రూ.42,750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే, ఫిరోజ్‌పూర్‌లో పీజీఐఎంఈఆర్ శాటిలైట్ సెంటర్ సహా రూ.42,750 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పంజాబ్ పర్యటనలో ఎన్నికల ర్యాలీల్లో కూడా మోదీ పాల్గొనబోతున్నట్లు సమాచారం.

అయితే మోదీ పర్యటనను కొన్ని రైతు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పంటకు కనీస మద్దతు ధర (MSP)కి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావాలని, రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కొన్ని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫిరోజ్‌పూర్ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రధాని పర్యటన సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి నాగేశ్వరరావు తెలిపారు. ఫిరోజ్‌పూర్ జిల్లాలో సుమారు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అంతేకాకుండా ఫిరోజ్‌పూర్ జిల్లాలో యాంటీ డ్రోన్ బృందాన్ని కూడా మోహరించినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ పోలీసులు… ఎన్‌ఎస్‌జి, ఆర్మీ మరియు బిఎస్‌ఎఫ్‌లతో సమన్వయంతో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.

ALSO READ Maoist Attack : మాజీ ఎమ్మెల్యేపై మావోయిస్టుల ఎటాక్.. ఇద్దరు గన్‌మేన్ల గొంతు కోశారు