CAAకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం

CAAకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం

Updated On : January 17, 2020 / 10:50 AM IST

CAA అంశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు దృష్టిలో ఉంచుకుని పంజాబ్ వ్యతిరేకంగా తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీఆర్, ఎన్నార్సీలపైనా ఆలోచించే పనిలో ఉంది. అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో భాగంగా రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్రా దీనికి రిసొల్యూషన్ వెదుకుతూ బిల్లును ప్రవేశపెట్టారు. 

‘పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందిన సీఏఏ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగేలా చేస్తున్న సంగతి తెలిసిందే. విరామంలో లేకుండా అల్లర్లు జరిగేందుకు కారణమైంది. చట్ట వ్యతిరేకంగా పంజాబ్ లోనూ ఆందోళనలు జరిగాయి. అవి శాంతియుతంగానే ముగిశాయి’ అని తీర్మానం చదువుతూ మోహింద్రా అన్నారు. 

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘దేశంలో ఏం జరుగుతుంది. యూపీలో చాలా మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. జర్మనీలో ఏం జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. ముందు కమ్యూనిస్టులపై దాడి చేశారు. ఆ తర్వాత యూదులను చంపారు. మాట్లాడటానికి ఇదే సరైన సమయం. పేద ప్రజలు బర్త్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోగలరు. ఇది చాలా విషాదకరం. నా జీవితకాలంలో ఇలాంటివి ఇక్కడి ఉండగా చూస్తాననుకోలేదు. సోదరభావాన్ని ముక్కలు చేస్తున్నారు మీరు’ అని వెల్లడించారు. 

పార్లమెంట్‌లో సీఏఏకు అనుకూలంగా ఓటేసిన శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ) రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి మద్ధతు తెలిపింది. ప్రజలకు నచ్చని ఏ చట్టానికైనా తాము వ్యతిరేకంగానే ఉంటామని ఎస్ఏడీ లీడర్ బిక్రమ్ మజితీ అన్నారు.