రాత్రి 9నుంచి ఉదయం 6వరకు : మహిళలను ఉచితంగా ఇళ్ల దగ్గర డ్రాప్ చేస్తాం

  • Published By: venkaiahnaidu ,Published On : December 4, 2019 / 12:11 PM IST
రాత్రి 9నుంచి ఉదయం 6వరకు : మహిళలను ఉచితంగా ఇళ్ల దగ్గర డ్రాప్ చేస్తాం

Updated On : December 4, 2019 / 12:11 PM IST

రోజురోజుకీ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల దగ్గర దిగబెట్టనున్నట్టు సీఎం అమరీందర్‌ సింగ్‌ మంగళవారం (డిసెంబర్-3,2019) తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సీఎం ప్రకటించారు.ఇందుకోసం మహిళలు 100, 112, 181 నెంబర్లకు ఫోన్‌ చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీ దిన్‌కర్‌ గుప్తాను సీఎం ఆదేశించారు.

మహిళలు చేరుకోవాల్సిన ప్రదేశానికి టాక్సీ గానీ, భద్రతతో కూడిన రవాణా సదుపాయం గానీ లేకపోతే పోలీసులు వారికి సాయం అందిచనున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చే సమయంలో ఒక మహిళ కానిస్టేబుల్‌ తోడుగా ఉండనున్నారు.

ఇందుకోసం కేటాయించిన వాహనాలు రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయాలతో పాటు, ఇతర ముఖ్య నగరాల్లో అందుబాటులో ఉంఉనున్నాయి. జిల్లా స్థాయిలో డీఎస్పీ గానీ, ఏసీపీ గానీ ఈ పథకానికి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు.