తబ్లిగీ సభ్యుల వికృత చేష్టలు…బాటిల్స్ లో మూత్రం నింపి విసిరేస్తున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2020 / 12:44 PM IST
తబ్లిగీ సభ్యుల వికృత చేష్టలు…బాటిల్స్ లో మూత్రం నింపి విసిరేస్తున్నారు

Updated On : April 8, 2020 / 12:44 PM IST

ఢిల్లీలో క్వారంటైన్ లో ఉన్న తబ్లిగీ జమాత్ సభ్యులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గత నెలలో ఢిల్లీలో ఆంక్షలు ఉన్న సమయంలోనే నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన తబ్లిగి జమాత్‌ సమావేశాలు దేశవ్యాప్తంగా కలకం సృష్టించిన విషయం తెలిసిందే. తబ్లిగీ జమాత్ సమావేశాల అనంతరం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాలు తబ్లిగి జమాత్‌ సమావేశానికి హాజరైన వారిని గుర్తించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కరోనా లక్షణాలు లేని తబ్లిక్‌ సభ్యులను క్వారంటైన్‌ చేశాయి. అయితే వీరిలో కొందరు వైద్య సిబ్బందితో, అధికారులతో అసభ్యకరంగా ప్రవరిస్తున్నారు. దీంతో కోన్నిచోట్ల వారిని డీల్‌ చేయడం కష్టంగా మారింది. 

అయితే ఇప్పుడు ఢిల్లీ ద్వారకాలోని నాలుగు ఫ్లాట్ లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న కొందరు తబ్లిగి జామాత్‌ సభ్యులు వికృత చర్యకు పాల్పడ్డారు. బాటిల్స్‌లో మూత్రం నింపి వాటిని బయటకు విసిరివేశారు. తబ్లిగీ సభ్యులు ఉన్న బిల్డింగ్ వెనుకవైపు ఉన్న ఓ వాటర్ పంపు దగ్గర రెండు యూరిన్ నింపిన బాటిల్స్ లభించాయి. మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో జమాత్ సభ్యులు క్వారంటైన్ లో ఉన్న ప్రాంతంలో మూత్రం నింపిన బాటిల్స్ ను గుర్తించారు. కొంతమందిపై ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదుచేయబడింది.

ద్వారకా సెక్టార్ 16Bలోని క్వారంటైన్ సెంటర్ అసిస్టెంట్ డైరక్టర్ ఇచ్చిన కంప్లెయింట్ ప్రకారం..వైరస్ ను ఇతరులకు వ్యాప్తి చేయాలన్న ఉద్దేశ్యంతో జమాత్ సభ్యులు మూత్రం నింపిన బాటిల్స్ ను విసిరేస్తున్నారు.  కరోనాను విస్తరించే ఆలోచనతో తబ్లిగి జామాత్‌ సభ్యులు ఈ చర్యకు పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా, ఢిల్లీలోని మర్కజ్‌లో ప్రార్థనల అనంతంరం ఇళ్లకు చేరకున్న పలువురు తబ్లిగి జమాత్‌ సభ్యుల్లో కొందరు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించకుండా రహస్యంగా ఉంటున్నారు. రెండు రోజుల క్రితం లక్నోలోని ఓ మసీదులో దాక్కున్న పలువురు జామత్ సభ్యులను గుర్తించి వారిని క్వారంటైన్ సెంటర్ కు తరలించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో సగం కేసులు తబ్లిగీ జమాత్ కు హాజరైనవారివే.