ప్రభుత్వం పెట్టే లంచ్ కోసం ఉదయం 6నుంచే పడిగాపులు

ప్రభుత్వం పెట్టే లంచ్ కోసం ఉదయం 6నుంచే పడిగాపులు

Updated On : April 14, 2020 / 5:51 AM IST

ఢిల్లీలో ఉదయం నుంచే బ్యాగులు, కంటైనర్లు, బ్యాగులు రోడ్ల మీద నిలువుగా దర్శనమిస్తాయి. కారణం.. సోషల్ డిస్టెన్స్ కదా.. అందుకే అవి పెట్టి వైరస్ రాకుండా జాగ్రత్తపడుతున్నారనుకోవద్దు.  ప్రభుత్వం పెట్టే భోజనం ఉదయం 6నుంచే పడిగాపులు కాసి ఎండకు తట్టుకోలేక అలా పెట్టి నీడకు వెళ్లి నిల్చొంచుటున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఏర్పాటు చేసిన లాక్‌డౌన్ ప్రభావంతో ఆకలిగా ఉండకూడదని ఢిల్లీ ప్రభుత్వం ఉచితంగా లంచ్ ఏర్పాటు చేస్తుంది. 

ఢిల్లీలోని బడ్లీ గవర్నమెంట్ స్కూల్‌లో 500మంది ఉచిత భోజనం కోసం క్యూ కట్టారు. పప్పు, అన్నం, బిస్కట్లతో కడుపునింపుకునేందుకు ఉదయం నుంచి పడిగాపులు గాస్తున్నారు. సూర్యుడి ఎండ మండిపోతున్నా.. 1200మంది క్యూలో నిలబడుతున్నారు. 

ఒక్కో రోజు లంచ్ కోసం ఉదయం 6గంటలకే వచ్చేస్తాం అని వారిలో ఒకడైన మొహమ్మద్ షాజాద్ అంటున్నారు. ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేకునే వ్యక్తికి మార్చి 24లాక్ డౌన్ తో సంపాదనే లేకుండాపోయింది. ప్రస్తుతం కుటుంబం కోసం ఒక కిలోమీటర్ ఆటోలో వెళ్లి మధ్యాహ్నానికి ఆహారం తెచ్చుకుంటున్నారు. ఫోన్లో రీఛార్జ్ అమౌంట్ కు కూడా డబ్బుల్లేక బీహార్లో ఉన్న అతని ఆరుగురు పిల్లలతో మాట్లాడటం కూడా కుదరడం లేదని అంటున్నాడు. అతని భార్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. 

ఢిల్లీలో ఇలా 2వేల 500 సెంటర్లలో లంచ్, డిన్నర్ ఉచితంగా పెడుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీ ప్రభుత్వం రోజుకు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రజలేమో రోజువారీ కోటా అందక పస్తులతో గడుపుతుండటం బాధాకరం. 

కొన్ని సార్లు మన వంతు వచ్చేసరికి భోజనం అయిపోతుంది. అప్పటికే గంటలపాటు చేసిన నిరీక్షణ పనికిరాకుండా పోతుంది. అందుకోసమే ఖాళీ కంటైనర్ పెట్టి తన వంతు ఆపుకుంటానని ఒక వ్యక్తి చెబుతున్నాడు. అయినప్పటికీ తనకు భోజనం దొరుకుతుందనే నమ్మకం లేదని అంటున్నాడు. ఇదిలా ఉంటే, ఆకలి తాపత్రయంతో కొద్దిగా ముందుకు జరిగినా.. కరోనా మహమ్మారి పొంచుకుని ఉంటుందనే జాగ్రత్త మరిచిపోకూడదు వారి ఆకలిదప్పులు తీరెదెప్పుడో.. 

ఢిల్లీలో ఇప్పటివరకూ 1154కరోనా కేసులు నమోదు కాగా 24మంది చనిపోయారు. 

Also Read | మే3 వరకు లాక్‌డౌన్, ఏప్రిల్ 20వ తేదీ తర్వాత సడలింపులు: మోడీ