Rahul on Mimicy row: మిమిక్రీ వివాదంపై తొలిసారి స్పందించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్

వాస్తవానికి, ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంటు మెట్లపై ప్రతిపక్షాల నిరసన సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‭కఢ్‭ను తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ అనుకరించారు.

Rahul on Mimicy row: మిమిక్రీ వివాదంపై తొలిసారి స్పందించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్

Updated On : December 20, 2023 / 5:29 PM IST

రాజ్యసభ చైర్మన్ జగ్‭దీప్ ధన్‭కఢ్‭ను అనుకరిస్తూ అవమానించి మిమిక్రీ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. ఎంపీలు పార్లమెంట్ భయట కూర్చున్నారని, తాను వారి వీడియోను చిత్రీకరించానని చెప్పారు. తన వీడియో తన ఫోన్‌లో ఉందని, అయితే మీడియా ఎంతసేపు ఇదే చూపిస్తోందని రాహుల్ మండిపడ్డారు. 150 మంది ఎంపీలు పార్లమెంట్ బయటకు పంపబడ్డారని, అయితే దీనిపై ఎవరూ ఏమీ అనలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘అటు మీడియాలో ఇటు పార్లమెంటులో అదానీపై చర్చ లేదు, రాఫెల్‌పై చర్చ లేదు, నిరుద్యోగంపై చర్చ లేదు. మా ఎంపీలు నిరాశతో బయట కూర్చున్నారు. కానీ మీరు దాని గురించి (మిమిక్రీ) చర్చిస్తున్నారు’’ అని రాహుల్ అన్నారు. వాస్తవానికి, ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంటు మెట్లపై ప్రతిపక్షాల నిరసన సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‭కఢ్‭ను తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ బెనర్జీ అనుకరించారు. ఈ సందర్భంగా రాహుల్ వీడియో రికార్డ్ చేశారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. దీనిపై అధికార బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది.