Rahul Gandhi : కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ రీఎంట్రీ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)మీటింగ్ లో

Rahul
Rahul Gandhi కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC)మీటింగ్ లో పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రులతో పాటు సీనియర్ నేత ఏకే ఆంటోనీ సహా పలువురు నేతలు రాహుల్ గాంధీని తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్టటాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు చేపట్టే అంశాన్ని తప్పుకుండా పరిశీలిస్తానని నేతలకు రాహుల్ హామీ ఇచ్చారు.
అయితే పార్టీ అధ్యక్ష పదవిని తిరిగిచేపట్టాలని నేతల నుంచి ఎంతో కాలంగా డిమాండ్లు పెరుగుతున్నా ఇప్పటివరకు మౌనంగా ఉన్న రాహుల్.. తాజాగా జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ విషయంపై ఆలోచిస్తాను అని చెప్పడంతో రాహుల్ రీ ఎంట్రీ ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సిద్ధాంతాల స్థాయి నుంచి స్పష్టత అవసరమని, రాజకీయ నేతలు తమ నిర్ణయాన్ని వెల్లడించాలని రాహుల్ తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేంత వరకు రాహుల్.. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగాలని పలువురు సీనియర్లు అభిప్రాయపడినట్టు సమాచారం.
కాగా,2019 సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకోవడంతో సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా సీడబ్ల్యూసీ నియమించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)మీటింగ్ లో సభ్యులందరూ రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేత అంబికా సోని విలేకరుల సమావేశంలో తెలిపారు. పార్టీ పగ్గాలను చేపట్టాలా లేదా అని తేల్చుకోవాల్సింది రాహుల్ గాంధీయేనని అంబికా సోని పేర్కొన్నారు. 2022 సెప్టెంబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని ఆమె చెప్పారు.
దేశ రాజకీయ పరిస్ధితులు, ధరల మంట, వ్యవసాయ సంక్షోభం, రైతులపై దాడుల వంటి అంశాలపై మూడు తీర్మానాలను ఆమోదించామని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ సీడబ్ల్యూసీ భేటీ అనంతరం వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు 2022 ఆగస్టు 21- సెప్టెంబర్ 20 మధ్య జరుగుతుందని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
ఇక, కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం తాను పూర్తిస్థాయి అధ్యక్షురాలిని అని ఇవాళ సీడబ్యూసీ సమావేశంలో సోనియా గాంధీ సృష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందని బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు. నూతన పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక కరోనా వల్లే ఆలస్యమైందని సోనియా గాంధీ.. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ పూర్వవైభవం కోరుకుంటున్నారన్నారు. అందుకు నాయకులు ఐక్యంగా ఉండటం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరమన్నారు.
ALSO READ అసమ్మతి నేతలకు సోనియా స్ట్రాంగ్ వార్నింగ్.. గీత దాటితే వేటు పడినట్లే