రాహుల్ గాంధీకి కరోనా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కరోనా వైరస్ సోకింది.

రాహుల్ గాంధీకి కరోనా

Rahul Gandhi Corona

Updated On : April 20, 2021 / 3:50 PM IST

Rahul Gandhi కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్పల్ప లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకున్నానని..తనకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని మంగళవారం ఓ ట్వీట్ లో రాహుల్ గాంధీ తెలిపారు. ఇటీవలకాలంలో తనను కలిసివారందరూ భద్రతా నిబంధనలు పాటించాలని,జాగ్రత్తగా ఉండాలని రాహుల్ కోరారు.

మరోవైపు, టాప్ కాంగ్రెస్ లీడర్,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(88) కూడా సోమవారం కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ “కోవాగ్జిన్”రెండు డోసులను తీసుకున్నప్పటికీ ఆయన కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.