దమ్ముంటే ఇప్పుడు రాళ్లు విసరండి : వందే భారత్‌లో మూడో కన్ను

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 03:34 PM IST
దమ్ముంటే ఇప్పుడు రాళ్లు విసరండి : వందే భారత్‌లో మూడో కన్ను

Updated On : April 6, 2019 / 3:34 PM IST

వందే భారత్ ఎక్స్ ప్రెస్.. మేకిన్ ఇండియాలో భాగంగా తయారైన భారత్ మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ట్రెయిన్. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ రైలుపై తరుచూ రాళ్ల దాడులు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసురుతున్నారు. ఈ దాడిలో రైలు అద్దాలు పగిలిపోతున్నాయి. దీన్ని రైల్వే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. రాళ్లు విసిరే వారిని గుర్తించేందుకు వీలుగా రైలుకి 4 సీసీ కెమెరాలు బిగించారు. రైలుకి ముందు భాగంలో రెండు, వెనుక భాగంలో రెండు కెమెరాలను ఫిట్ చేశారు. రాళ్లు విసిరేవారిని గుర్తించి తాట తీస్తామని పోలీసులు తెలిపారు. రాళ్ల దాడుల వల్ల ఇప్పటివరకు 12 అద్దాలు మార్చాల్సి వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుని 2 నెలల క్రితం పట్టాలపైకి తెచ్చారు. 2 నెల వ్యవధిలో 12 సార్లు రాళ్లు విసిరిన ఘటనలు జరిగాయి. రాళ్ల దాడులు జరక్కుండా.. స్థానికులకు, పిల్లలకు రైల్వే అధికారులు చాక్లెట్లు పంచారు. అయినా ఫలితం కుండా పోయింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు నడుస్తుంది. ఫిబ్రవరి 15, 2019న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ రైలుని ప్రారంభించారు. ఢిల్లీ వారణాసి మధ్య తిరుగుతోంది.