Railways loses : చలిగాలుల ప్రభావంతో రైల్వేకు భారీ నష్టం.. 20 వేల టికెట్ల రద్దు

ఉత్తరాది రాష్ట్రాల్లో వీస్తున్న చలిగాలుల ప్రభావం రైల్వేశాఖపై పడింది. తీవ్ర చలిగాలులు, దట్టమైన పొగ కమ్ముకోవడం వల్ల పలు రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. దీనివల్ల 20వేల మంది రైలు ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకున్నారు....

Railways loses : చలిగాలుల ప్రభావంతో రైల్వేకు భారీ నష్టం.. 20 వేల టికెట్ల రద్దు

train

Updated On : January 6, 2024 / 11:37 AM IST

Railways loses : ఉత్తరాది రాష్ట్రాల్లో వీస్తున్న చలిగాలుల ప్రభావం రైల్వేశాఖపై పడింది. తీవ్ర చలిగాలులు, దట్టమైన పొగ కమ్ముకోవడం వల్ల పలు రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. దీనివల్ల 20వేల మంది రైలు ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకున్నారు. టికెట్ల రద్దు వల్ల రైల్వే శాక 1.22 కోట్ల నష్టం వాటిల్లిందని భారతీయ రైల్వే శాఖ అధికారులు చెప్పారు. ఉత్తర భారతదేశంలోని అనేక జిల్లాల్లో దట్టమైన పొగమంచు కారణంగా భారతీయ రైల్వేల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.

ALSO READ : Bangladesh : బంగ్లాదేశ్ బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం…నలుగురు మృతి

భారతీయ రైల్వే పరిధిలోని మొరాదాబాద్ డివిజన్ లో డిసెంబర్ నెలలో 20వేల టికెట్లను రద్దు చేశారు. టిక్కెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు రూ.1.22 కోట్లు తిరిగి చెల్లించామని మొరాదాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ రాజ్ కుమార్ సింగ్ చెప్పారు. రిజర్వ్ చేసిన టిక్కెట్లలో 4,230 బరేలీలో, 3,239 టిక్కెట్లు మొరాదాబాద్‌లో రద్దు చేశారు.

ALSO READ : Gangster Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం…ఢిల్లీ లాయర్ కొనుగోలు

పొగమంచు కారణంగా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను రద్దు చేశామని సింగ్ పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో జనవరి 6 వరకు రాత్రి, ఉదయం చాలా గంటలపాటు దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.