Viral Video: రైళ్లను అప్పుడు అలా కడిగేవారు.. ఇప్పుడు ఇలా కడుగుతున్నారు
టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తుండడంతో అన్ని రంగాల్లోనూ దాని ఆధారంగానే పనులు జరుగుతున్నాయి. గతంలో రైళ్లను శుభ్రం చేయాలంటే ఒకరు పైపుతో నీళ్లు పోసేవారు, మరొకరు తుడిచేవారు. అయితే, ఇప్పుడు మనిషి అవసరం లేకుండా అందుకు యంత్రాలను వాడుతున్నారు. స్క్రబ్బర్ల సాయంతో రైళ్లను కడిగేస్తున్నారు.

Viral Video
Viral Video: టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తుండడంతో అన్ని రంగాల్లోనూ దాని ఆధారంగానే పనులు జరుగుతున్నాయి. గతంలో రైళ్లను శుభ్రం చేయాలంటే ఒకరు పైపుతో నీళ్లు పోసేవారు, మరొకరు తుడిచేవారు. అయితే, ఇప్పుడు మనిషి అవసరం లేకుండా అందుకు యంత్రాలను వాడుతున్నారు. స్క్రబ్బర్ల సాయంతో రైళ్లను కడిగేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అప్పట్లో రైళ్లను ఎలా కడిగేవారో, ఇప్పుడు ఎలా కడుగుతున్నారో వీడియో ద్వారా చూపించారు. గతంలో రైళ్లపై ఉన్న దుమ్మును, రైళ్లకు అంటుకుపోయిన ఇతర పదార్థాలను చేతితో శుభ్రం చేయడానికి సిబ్బంది చాలా ఇబ్బందులు పడేవారు.
ఇప్పుడు వారు స్విచ్ వేస్తే చాలు భారీ స్క్రబ్బర్లు ఆన్ అవుతున్నాయి. వాటి సాయంతో రైళ్లను కడుగుతున్నారు. రైల్వే శాఖ వాటిని వాడుతుండడం పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే, స్క్రబ్బర్లను చాలా ఆలస్యంగా భారతీయ రైల్వేలు వాడుతున్నాయని కొందరు పేర్కొంటున్నారు.
From hand press to systematic switch. pic.twitter.com/J9jaTnmUrJ
— Ministry of Railways (@RailMinIndia) February 26, 2023
Kashmiri Pandit: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి