Rajasthan Assembly election: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలో మార్పు.. ఎందుకంటే?

నవంబరు 25న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ మార్చుతూ ప్రకటన విడుదల చేసింది.

Rajasthan Assembly election: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలో మార్పు.. ఎందుకంటే?

Updated On : October 11, 2023 / 5:16 PM IST

Assembly Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీ మారింది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 23న పోలింగ్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే, రాజస్థాన్ లో అదే రోజు వందలాది పెళ్లిళ్లు జరగాల్సి ఉండడంతో పోలింగ్ తేదీని మార్చాలని విజ్ఞప్తులు వచ్చాయి.

దీంతో నవంబరు 25న పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ మార్చుతూ ప్రకటన విడుదల చేసింది. ఫలితాలు మాత్రం ముందుగా ప్రకటించినట్లు డిసెంబరు 3నే వెల్లడవుతాయి.

నవంబరు 23న చాలా పెళ్లిళ్లు, ఇతర వేడుకలు ఉండడం, లాజిస్టిక్స్ సమస్యల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ రోజున ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పింది. కాగా, నవంబర్ 23న కార్తీక శుద్ధ ఏకాదశి ఉంది. ఈ రోజు విష్ణు మూర్తికి పూజలు చేస్తారు.

పోలింగ్ తేదీని మార్చాలని ఈసీని పలు రాజకీయ పార్టీలు కూడా కోరాయి. రాజస్థాన్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మిగతా నాలుగు రాష్ట్రాల ఎన్నికల తేదీల్లో ఎలాంటి మార్పూ లేదు.

ECI changes the date of Assembly poll in Rajasthan

ECI changes the date of Assembly poll in Rajasthan

ECI changes the date of Assembly poll in Rajasthan


Rajasthan Assembly election

Chandrababu : చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దు.. ఆ కేసుల్లో టీడీపీ అధినేతకు తాత్కాలిక రిలీఫ్