Rajendra Singh: అసెంబ్లీలో 50 మంది దాడి చేశారు.. పిడిగుద్దులు కురిపించారు..: ఎమ్మెల్యే కన్నీరుమున్నీరు

తాను చేసిన తప్పేంటో చెప్పాలని కన్నీరు పెట్టుకున్నారు.

Rajendra Singh: అసెంబ్లీలో 50 మంది దాడి చేశారు.. పిడిగుద్దులు కురిపించారు..: ఎమ్మెల్యే కన్నీరుమున్నీరు

Rajendra Singh Gudha

Updated On : July 24, 2023 / 6:29 PM IST

Rajendra Singh – Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీలో తనపై దాదాపు 50 మంది దాడి చేశారని, పిడిగుద్దులు కురిపించారని ఇటీవల మంత్రి పదవి పోగొట్టుకున్న కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే రాజేంద్ర సింగ్‌ గుడా ఏడుస్తూ తెలిపారు. కాంగ్రెస్ నేతలు తనను అసెంబ్లీ నుంచి బయటకు లాగిపడేశారని అన్నారు.

రాజస్థాన్ అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పారు. తాను బీజేపీతో కలిశానని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తాను చేసిన తప్పేంటో చెప్పాలని కన్నీరు పెట్టుకున్నారు. తన వద్ద రెడ్ డైరీ ఉందని, సీఎం అశోక్ గహ్లోత్ కు సంబంధించిన నగదు లావాదేవీల గురించి అందులో ఉందని చెప్పారు.

కాగా, రాజస్థాన్‌ మంత్రిగా ఉంటూ, సొంత సర్కారుపై అసెంబ్లీలో రాజేంద్ర సింగ్‌ గుడా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఆయన మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఇవాళ అసెంబ్లీకి హాజరైన ఆయన.. మంత్రి శాంతి ధరివాల్‌తో గొడవ పెట్టుకున్నారు. అసెంబ్లీలో రాజేంద్ర సింగ్‌ గుడా చుట్టుముట్టారు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

అనంతరం రాజేంద్ర సింగ్‌ వెల్‌ లోకి వెళ్లి ఆందోళన తెలిపారు. చివరకు ఆయనను మార్షల్స్‌ లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం రాజేంద్ర సింగ్‌ గుడా మణిపూర్ ఘటనపై రాజస్థాన్ అసెంబ్లీలో మాట్లాడుతూ… తమ రాష్ట్రంలోనూ మహిళలపై దాడులు పెరిగాయని, తమ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను గహ్లోత్ మంత్రి పదవి నుంచి తొలగించారు.

Dhulipalla Narendra Kumar: అందుకోసమే సీఎం జగన్ పోరాటం చేస్తున్నారు: టీడీపీ నేత ధూళిపాళ్ల