Rajya Sabha: రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీటు వద్ద కరెన్సీ నోట్ల కలకలం.. చైర్మన్ విచారణకు ఆదేశం

ఈ అంశంపై అభిషేక్ మను సింఘ్వీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నేను మొదటిసారి విన్నా.. ఇలాంటిది. ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. నేను ఎప్పుడూ రాజ్యసభకు వెళ్లినా ..

Rajya Sabha: రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీటు వద్ద కరెన్సీ నోట్ల కలకలం.. చైర్మన్ విచారణకు ఆదేశం

Rajya Sabha Chairman Jagdeep Dhankhar

Updated On : December 6, 2024 / 12:21 PM IST

Currency Notes in Rajya sabha: రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడి సీటు వద్ద కరెన్సీ నోట్లు దొరకడం తీవ్ర దుమారం రేపింది. గురువారం రాజ్యసభలో సెక్యూరిటీ సిబ్బంది 500 నోట్లతో కూడిన రూ.50వేల నగదు కట్టను గుర్తించారు. ఈ అంశాన్ని రాజ్యసభ భవన్ అధికారులు చైర్మన్ జగదీప్ ధన్ఖర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై విచారణ జరపాలని ఆదేశించినట్లు రాజ్యసభ చైర్మన్ వెల్లడించారు.

Also Read: Benefit Shows : సంధ్య థియేటర్ ఘటన.. పుష్ప 2 దెబ్బకు సినీ పరిశ్రమకు షాక్.. ఇకపై బెనిఫిట్ షోలు రద్దు..

శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. గురువారం సభ వాయిదా పడిన తరువాత సీటు నెంబర్ 222 వద్ద నగదు దొరికినట్లు భద్రతా అధికారులు నాకు తెలియజేశారని, ఆ సీటును తెలంగాణ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారని తెలిపారు. ఈ వ్యవహారంలో నిబంధనల ప్రకారం విచారణ జరిపించడం జరుగుతుందని అన్నారు. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. చైర్మన్ తీరును తప్పుబట్టారు. నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంపై విచారణ కొనసాగించడంలో తప్పులేదు. అయితే, విచారణలో విషయం తేలే వరకు మీరు అభిషేక్ మను సింఘ్వీ పేరు మాట్లాడి ఉండాల్సింది కాదని ఖర్గే సూచించారు. ఖర్గే వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు తప్పుబట్టారు. ఆ వెంటనే ఖర్గే మాట్లాడుతూ.. చైర్మన్ ఏదైనా నిర్దిష్ట వ్యక్తి పేరు, సీటు గురించి ఎలా చెబుతారు అంటూ ప్రశ్నించారు. చైర్మన్ స్పందిస్తూ.. ఏ సీటు వద్ద దొరికిందో.. ఎవరికి ఆ సీటును కేటాయించారో మాత్రమే చెప్పామని అన్నారు.

Also Read: Sanjay Raut: ఆయన శకం ముగిసింది.. ఏక్‌నాథ్‌ షిండేపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..

ఈ అంశంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకరం. తీవ్రమైన అంశం. ప్రతిపక్ష నాయకులుకూడా సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తారని నేను ఆశాభావంతో ఉన్నానంటూ పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ అంశంపై అభిషేక్ మను సింఘ్వీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. నేను మొదటిసారి విన్నా.. ఇలాంటిది. ఇప్పటి వరకు ఎప్పుడూ వినలేదు. నేను ఎప్పుడూ రాజ్యసభకు వెళ్లినా జేబులో రూ.500 నోటు ఒక్కటే పెట్టుకుంటాను. నేను రాజ్యసభకు గురువారం మధ్యాహ్నం 12.27 గంటలకు చేరున్నాను. మధ్యాహ్నం 1గంటకు సభ వాయిదా పడింది. నేను అప్పటి నుంచి 1.30 గంటల వరకు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కేంటిన్ లో కూర్చున్నాను.. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయా అంటూ సింఘ్వీ ట్వీట్ లో పేర్కొన్నాడు.