Rakesh jhunjhunwala : ఒక్కరోజులో రూ. 861 కోట్లు సంపాదన

ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతిపెద్ద స్టాక్ బెట్ టైటాన్ కంపెన, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్చి 17వ తేదీ శనివారం ట్రేడింగ్ లో మెరిసిపోయింది. టైటాన్ కు సంబంధించిన షేర్లు...

Rakesh jhunjhunwala : ఒక్కరోజులో రూ. 861 కోట్లు సంపాదన

Rakesh

Updated On : March 19, 2022 / 6:00 PM IST

Rakesh jhunjhunwala : ఒక్క రోజులో మీరు ఎంత సంపాదిస్తారు ? రూ .100 లేదా రూ. 500 మరింత అయితే.. రూ. 1000, ఇంకా అయితే.. రూ. 10 వేలు అంతేకదా. అదే ధనవంతుల విషయానికి వస్తే.. ఇది తేడగా ఉంటుంది. వారి రోజు సంపాదన లక్షల్లోనే ఉంటుంది. లక్షలు, కోట్లు సంపాదిస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు. ఓ వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల సంపదను ఎవరైనా సృష్టంచగలరా అంటే.. అందరి చూపు ఆయన వైపు వెళుతుంది. కొన్ని గంటల వ్యవధిలో కోట్లు గడిస్తుంటారు. ఆయనే ఇండియన్ బిగ్ బుల్ గా పేరొందిన ‘రాకేశ్ ఝున్ ఝున్ వాలా’. తాజాగా ఏకంగా రూ. 861 కోట్లు సంపాదించి తన సత్తా ఏంటో చూపించారు.

Read More : Rakesh Jhunjhunwala: ఎయిర్ లైన్స్ బిజినెస్‌లోకి ఝున్ ఝున్ వాలా.. రూట్ క్లియర్ చేసిన కేంద్రం

ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతిపెద్ద స్టాక్ బెట్ టైటాన్ కంపెన, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మార్చి 17వ తేదీ శనివారం ట్రేడింగ్ లో మెరిసిపోయింది. టైటాన్ కు సంబంధించిన షేర్లు ఒక్కసారిగా రూ. 2 వేల 587 నుంచి రూ. 2 వేల 706కి ఎగబాకాయి. ప్రతి షేర్ విలువ రూ. 118.70 పెరిగింది. స్టార్ హెల్త్ షేరు ధర రూ. 608. 80 నుంచి రూ. 641కి పెరిగింది. అంటే షేరు ధర రూ. 32.20కి పెరిగింది. అంటే స్టార్ హెల్త్ షేర్ పెరగడం వల్ల ఆయన నికర సంపద సుమారు రూ. 324 కట్లు. టైటాన్ షేర్ ధర, స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడం వల్ల నికర విలువ పెరుగుదల రూ. 861 కోట్లు.

Read More : India’s Big Bull : స్టాక్స్ అమ్మే విషయంలో ఝున్‌‌ఝున్‌‌వాలా ఏం చేస్తారు ?

టైటాన్ షేర్ హోల్డింగ్ ప్రకారం…రాకేష్ ఝున్ ఝున్ వాలా, ఆయన సతీమణి రేఖా ఝున్ ఝున్ వాలాకు కంపెనీలో వాటా ఉంది. 3,57,10,395 షేర్లు ఝున్ ఝున్ వాలా, రేఖా ఝున్ ఝున్ వాలాకు 95,40,575 షేర్లు కలిగి ఉన్నారు. వీరిద్దరూ కలిపి 4,52,50,970 షేర్లు (5.09) కలిగి ఉన్నారు. 4,52,50,970 టైటాన్ షేర్లు కలిగి ఉన్న ఝున్ ఝున్ వాలా నికర పెరుగుదలలో సుమారు రూ. 537 కోట్లు, 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్లను కలిగి ఉన్నారు. వీటి షేర్ల ధరలు పెరగడం వల్ల ఒక్కరోజులోనే రూ. 861 కోట్లు సంపాదించారు ఝున్ ఝున్ వాలా.