Rakesh Jhunjhunwala: ఎయిర్ లైన్స్ బిజినెస్‌లోకి ఝున్ ఝున్ వాలా.. రూట్ క్లియర్ చేసిన కేంద్రం

దేశీయ స్టాక్ మార్కెట్లలో పరిచయం అక్కర్లేని వ్యక్తి రాకేష్ ఝున్ ఝున్ వాలాది. ఏస్ ఇన్వెస్టర్‌ అయిన రాకేష్ కొత్తగా విమానయాన రంగంలో అడుగుపెడుతున్నాడు.

Rakesh Jhunjhunwala: ఎయిర్ లైన్స్ బిజినెస్‌లోకి ఝున్ ఝున్ వాలా.. రూట్ క్లియర్ చేసిన కేంద్రం

Rakesh

Rakesh Jhunjhunwala: దేశీయ స్టాక్ మార్కెట్లలో పరిచయం అక్కర్లేని వ్యక్తి రాకేష్ ఝున్ ఝున్ వాలాది. ఏస్ ఇన్వెస్టర్‌ అయిన రాకేష్ కొత్తగా విమానయాన రంగంలో అడుగుపెడుతున్నాడు. అకాసా ఎయిర్ లైన్స్ పేరుతో మార్కెట్లోకి రాబోతున్నారు. పౌర విమానయాన మంత్రిత్వశాఖ మరియు DGCA నుంచి లేటెస్ట్‌గా ఈ ఎయిర్ లైన్స్ సంస్థకు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ లభించింది. ఆకాశ ఎయిర్ 2021 చివరి నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రాబోయే నాలుగేళ్లలో 70 విమానాలతో ఎయిర్‌లైన్స్ నడిపించాలని యోచిస్తున్నారు ఝున్ ఝున్ వాలా. ఇందుకోసం ఝున్ ఝున్‌వాలా 35 మిలియన్ డాలర్లు అంటే, సుమారు రూ.260 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. సంస్థలో అతని వాటా 40 శాతం ఉంటుంది. భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) పొందింది. భారతదేశంలో తక్కువ ఖర్చుతో విమానయాన సంస్థను ప్రారంభించాలని ఝున్ ఝున్‌వాలా ప్రయత్నిస్తున్నారు. చాలా ఛీప్‌గా దేశీయ విమాన సర్వీసులను ఆకాశ ద్వారా ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ విమానయాన సంస్థ కోసం ఏవియేషన్ స్టాల్వర్ట్ అండ్ ఇండిగో మాజీ అధ్యక్షుడు ఆదిత్య ఘోష్ పనిచేయనున్నట్లు చెబుతున్నారు. ఆదిత్య ఘోష్ కంపెనీలో సహ వ్యవస్థాపకుడిగా చేరనున్నారు. ఝున్ ఝున్‌వాలా అండ్ జెట్ ఎయిర్‌వేస్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) వినయ్ దుబే కలిసి ఆకాశను ప్రారంభించబోతున్నారు. ఈ కొత్త విమానయాన సంస్థలో ఆదిత్య ఘోష్‌కు 10 శాతం కన్నా తక్కువ వాటా ఉంటుందని, ఝున్ ఝున్‌వాలా నామినీగా బోర్డు సభ్యుడిగా ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విమానయాన సంస్థలో వినయ్ దుబేకి 15 శాతానికి పైగా వాటా ఉండనుంది.

అమెరికాకు చెందిన పార్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, హోమ్‌స్టే అగ్రిగేటర్ ఎయిర్‌బిఎన్‌బి ఈ సంస్థలో పెట్టుబడులు పెడుతోంది.