సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్: రాజకీయాలకు గుడ్ బై

  • Published By: vamsi ,Published On : November 13, 2019 / 02:47 PM IST
సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్: రాజకీయాలకు గుడ్ బై

Updated On : November 13, 2019 / 2:47 PM IST

కర్ణాటక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన హీరోయిన్ రమ్య అలియాస్ దివ్య స్పందన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మళ్లీ సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. సినిమాల్లో క్రేజీ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రమ్య తిరిగి మూవీల్లో నటించేందుకు సిద్ధం అయ్యింది.

పునీత్‌ రాజ్‌కుమార్‌ సరసన అభి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రమ్య తక్కువ సమయంలోనే కన్నడ చిత్రసీమలో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ముక్కుసూటిగా మాట్లాడే ధోరణితో వివాదాలు కొని తెచ్చుకున్న ఈ నటి, 2013లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2017లో కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టడంతో సినిమాలకు దూరమయ్యారు.

సోషల్ మీడియా బాధ్యతలు చేపట్టిన ఆమెకు కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయంతో ఆమె సోషల్‌ మీడియా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.