క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకపోయినా పర్లేదా?

  • Published By: vamsi ,Published On : March 27, 2020 / 08:11 AM IST
క్రెడిట్ కార్డు బిల్లులు కట్టకపోయినా పర్లేదా?

Updated On : March 27, 2020 / 8:11 AM IST

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు ఇప్పటికే నిర్మానుష్యంగా మారిపోయాయి. ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ చేసేసిన పరిస్థితి. అయితే నెలాఖరుకు రాగానే ఇప్పడు సగటు సామాన్య, మధ్యతరగతి వ్యక్తి మదిలో మెదిలే ఆలోచన? ‘ఈఎమ్‌ఐ’. 

బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని నెల నెలా కట్టే ఈఎమ్ఐలు ఈ వారంలోనో… లేకపోతే వచ్చే నెల మొదటివారంలోనో వచ్చేస్తాయి. అయితే కేంద్రం దీనిపై కాస్త వెసులుబాటు అయితే ఇచ్చింది. కానీ, క్రెడిట్ కార్డు విషయంలో మాత్రం ఇంకా కూడా అనేకమందికి సందేహాలు ఉన్నాయి. 

రుణాలపై ప్రకటించిన మూడు నెలల మారటోరియం ప్రకారం గృహ, ఇతర రుణాలను తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి  ఉంటుంది. అంతేకాదు సదరు ఖాతాలను ఎన్‌పీఏలుగా పరిగణించరాదు. అయితే ఆర్‌బీఐ నిర్ణయం ప్రకటించిన తరువాత ప్రధానంగా క్రెడిట్ కార్డు వినియోగదారుల రుణాల పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

దీనిపై ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. క్రెడిట్ కార్డు రుణాలు, లేదా బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదు అని స్పష్టం చేసింది. అంటే క్రెడిట్ కార్డు బిల్లులు కచ్చితంగా కట్టాల్సిందే. 

See Also | మూడు నెలల ఈఎమ్‌ఐ వాయిదాపై సందేహాలు.. సమాధానాలు..