Musthafa PC : తిండి లేని స్థితి నుండి ఫుడ్ కంపెనీ సీఈఓగా ఎదిగిన ముస్తఫా PC సక్సెస్ ఫుల్ స్టోరీ చదవండి

తండ్రి రోజువారి కూలీ రూ.10 కుటుంబ పోషణకు సరిపోక..ఇంటిల్లిపాది కష్టపడ్డారు. ఇప్పుడు అతని కొడుకు కోట్లు విలువ చేసే ఫుడ్ కంపెనీకి యజమాని. తల్చుకుంటే సాధ్యం కానిది ఏది లేదని నిరూపించిన iD ఫ్రెష్ ఫుడ్ సీఈఓ ముస్తఫా PC సక్సెస్‌ఫుల్ స్టోరీ చదవండి.

Musthafa PC : తిండి లేని స్థితి నుండి ఫుడ్ కంపెనీ సీఈఓగా ఎదిగిన ముస్తఫా PC సక్సెస్ ఫుల్ స్టోరీ చదవండి

Musthafa PC

Musthafa PC : తండ్రి రోజు కష్టపడి తెచ్చిన కూలీ రూ.10 తో ఆ కుటుంబం జీవించేది. రెండు పూటల భోజనం తినడమే కష్టమైంది. అలాంటి కుటుంబం నుండి ఆ పెద్దాయన కొడుకు కోటీశ్వరుడిగా ఎదిగాడు. పేదరికంలో తాము అపురూపంగా తిన్న ఆహారాన్నే వ్యాపారంగా మార్చాడు. iD ఫ్రెష్ ఫుడ్ సీఈఓ ముస్తఫా PC సక్సెస్ ఫుల్ స్టోరీ చదవండి.

Sarojini Lakra : కాళ్లకు చెప్పులు కూడా లేని స్థాయి నుంచి ఐపీఎస్ వరకు .. గిరిజన మహిళ సరోజినీ లక్రా ఇన్స్పిరేషనల్ స్టోరీ

iD ఫ్రెష్ ఫుడ్ సీఈఓ ముస్తఫా PC ఈరోజు కోటీశ్వరుడు. కానీ ఆ స్థాయికి చేరడానికి తనెంత కష్టపడ్డాడో చదివితే స్ఫూర్తి కలుగుతుంది. ఇటీవల ‘ది నియాన్ షో’ పోడ్ కాస్ట్‌లో తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు ముస్తఫా. ముస్తఫా కేరళలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించారు. తండ్రి దినసరి కూలీ.. అక్షరాల రూ.10 వచ్చేదట. ఆ సంపాదన సరిపోక ముస్తఫా ఆయన తోబుట్టువులు గ్రామంలో కట్టెలు అమ్మేవారట. ఇంకా ముస్తఫా అనేక చిన్న ఉద్యోగాలు చేసేవారట.

ఓసారి ముస్తఫా రూ.150 డబ్బులు ఆదా చేసి మేకను కొన్నారట. కొంతకాలం తర్వాత ముస్తఫా ఆవును కొనడానికి సరిపడా డబ్బులు ఆదా చేసి మేకను అమ్మేసి ఆవుని కొనుగోలు చేసారట. అలా కొంత కుటుంబ పరిస్థితి మెరుగుపడిందట. కుటుంబం మూడు పూటల తినగలిగే స్ధాయికి వచ్చారట. ఇక ముస్తఫా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఆ తర్వాత ఐటీ ఉద్యోగాలు చేసారు. చివరికి ఇవేమీ ఆయనకు తృప్తి కలిగించలేదు. 2006 లో ‘iD ఫ్రెష్ ఫుడ్’ అనే కంపెనీని స్ధాపించారు. ఇది చిన్న వంటగదిలో వండుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆహారాన్ని విక్రయిస్తుంది.

Inspirational Story : భార్యకి చీర కొంటూ మిల్లు యజమానికి లాల్ బహదూర్ శాస్త్రి ఏం చెప్పారో తెలుసా!

iD ఫ్రెష్ ఫుడ్ కంపెనీ ప్రారంభించిన కొత్తలో ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నానని చెప్పారు ముస్తఫా. ప్యాక్ చేసిన ఇడ్లీ-దోస పిండిని పరిచయం చేయడంలో వినియోగదారుల విశ్వాసాన్ని పొందడం కష్టమైందని చెప్పారు. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ నడపడం చాలా కష్టమని చెప్పిన ముస్తఫా తాజా ఫుడ్ విక్రయించడం ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన పనిగా చెప్పారు. ఎన్నో ఎదురుదెబ్బలు అనంతరం iD ఫ్రెష్ ఫుడ్ వ్యాపారం విజయపథంలో దూసుకువెళ్తంది. ఇందులో ముస్తఫా కష్టం, లక్ష్యాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. స్ఫూర్తిని కలిగిస్తాయి.