Socialist – Secular Words : రాజ్యాంగ ప్రతిలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు తొలగింపు.. కేంద్రంపై విపక్షాల మండిపాటు
తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని అన్నారు.

socialist and secular words Removal
Socialist – Secular Words Removal : రాజ్యాంగ ప్రతుల్లో సోషలిస్టు, సెక్యులర్ పదాల తొలగింపు వివాదాస్పదంగా మారింది. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం అందించిన రాజ్యాంగ ప్రతుల్లో సోషలిస్టు, సెక్యులర్ పదాలను తొలగించడం వివాదాస్పదమైంది. తమకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని కాంగ్రెస్ లోక్ సభపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు.
ఇది చాలా తీవ్రమైన విషయమని అన్నారు. ఈ అంశంపై సోనియాగాంధీ కూడా స్పందించారు. కొత్త రాజ్యాంగ ప్రతుల పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని తెలిపారు. రాజ్యాంగ ప్రతుల పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాల తొలగింపు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. విపక్షాలకు సమాధానం ఇచ్చారు.
రాజ్యాంగం అసలు పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ పదాలు లేవని తెలిపారు. ఆ తర్వాతి కాలంలో సవరణ ద్వారా వాటిని చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగ ప్రతుల్లో అసలు రాజ్యాంగ పీఠికను కలిగి ఉన్నాయని తెలపారు. కాగా, మంత్రి వివరణపై విపక్షాలు మండిపడ్డాయి. తమకు తాజా ప్రతిని ఇస్తారా లేదా పాత ప్రతిని ఇస్తారా అంటూ నిలదీశారు.