Nit Jobs : కేరళ నిట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
ఎంపిక విధానానికి సంబంధించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Nit Calicut
Nit Jobs : కేరళ రాష్ట్రంలోని కాలికట్ లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్పెషల్ డ్రైవ్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూకేషన్, మేథమెటిక్స్, ఫిజిక్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీచింగ్, పరిశోధన అనుభవం కలిగి ఉండాలి
ఎంపిక విధానానికి సంబంధించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబరు 22గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్:http://www.nitc.ac.in/సంప్రదించగలరు.