Midhani Hyderabad : మిధాని హైదరాబాద్ లో పోస్టుల భర్తీ

మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్ మేనేజ్ మెంట్, కార్పోరేట్ కమ్యూనికేషన్, మెడికల్ తదితర విభాగాల్లోని పోస్టులను భర్తీ చేస్తారు.

Midhani Hyderabad : మిధాని హైదరాబాద్ లో పోస్టుల భర్తీ

Midhani Hyd

Updated On : January 4, 2022 / 9:12 PM IST

Midhani Hyderabad : హైదరాబాద్ లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులు భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో మేనేజ్ మెంట్ ట్రెయినీ 53 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ 6పోస్టులు, మేనేజర్ 2 పోస్టులు, ఉన్నాయి.

మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్ మేనేజ్ మెంట్, కార్పోరేట్ కమ్యూనికేషన్, మెడికల్ తదితర విభాగాల్లోని పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టును అనుసరించి 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్, ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 40 ఏళ్లు మించరాదు.

జీతభత్యాలు పోస్టును అనుసరించి ఏడాదికి 9లక్షల నుండి 40.70లక్షలు చెల్లిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపటానికి చివరి తేది 2022 జనవరి 15గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://midhani-india.in