అర్నాబ్ గోస్వామి అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : November 4, 2020 / 10:35 AM IST
అర్నాబ్ గోస్వామి అరెస్ట్

Updated On : November 4, 2020 / 12:25 PM IST

Republic TV Editor-in-Chief Arnab Goswami arrested రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్- చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ(నవంబర్-4,2020)ఉదయం పెద్ద సంఖ్యలో అర్నాబ్ నివాసానికి వెళ్లిన అలీబాగ్ పోలీసు బృందం ఆయనను అరెస్ట్ చేశారు. ఓ సూసైడ్ కేసులో అర్నాబ్ ని అరెస్ట్ చేశారు. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.




అయితే అరెస్టు చేసే క్రమంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారని అర్నబ్ తెలిపారు. తన కుటుంబ సభ్యులపై చేయి చేసుకున్నారని అర్నాబ్ ఆరోపించారు. తనపైనా భౌతిక దాడులకు పాల్పడ్డారని చెప్పారు.
https://10tv.in/trp-case-first-issue-summons-to-arnab-goswami-before-arraignment-hc-tells-mumbai-police/
కాగా, అర్నాబ్ అరెస్టును కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఖండించారు. మహారాష్ట్రలో పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందన్నారు. ఇది ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇదే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు
అసలు కేసు ఏంటీ
2018లో అన్వయ్ నాయక్ అనే ఆర్కిటెక్ట్​ తన తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ వారు ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు చెప్పారు.అన్వయ్ కుమార్తె ఆద్న్యా నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసుపై పునర్విచారణ ప్రారంభించినట్లు ఈ ఏడాది మేలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్​ముఖ్ తెలిపారు. రిపబ్లిక్ టీవీ బకాయిల చెల్లింపుపై ఇదివరకు అలీబాగ్ పోలీసులు విచారణ చేపట్టలేదని.. అందువల్లే తన తండ్రి, నానమ్మ ఆత్మహత్య చేసుకున్నారని ఆద్న్యా ఆరోపించినట్లు దేశ్​ముఖ్ తెలిపారు.