మరో “డిజిటల్ అరెస్ట్” మోసం.. రిటైర్డ్ ప్రొఫెసర్‌కు ఫోన్ చేసి రూ.75 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ఆమెను 10 రోజుల పాటు 'డిజిటల్ అరెస్ట్'లో ఉంచారు.

Digital Arrest
ఓ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్‌ను కేటుగాళ్లు “డిజిటల్ అరెస్ట్” చేసి 75 లక్షల రూపాయలు కాజేశారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్‌కు ఫోన్ చేసిన మోసగాళ్లు.. తాము ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి బెదిరించారు.
ఆమెను 10 రోజుల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచారు. ఈ విషయంపై పోలీసులు ఆదివారం వివరాలు తెలిపారు. బాధితురాలు ఖమర్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని అన్నారు. వెంటనే తాము ఆమె ట్రాన్సాక్షన్స్ చేసిన బ్యాంకులకు అలెర్ట్ జారీ చేశామని చెప్పారు.
ఆ డబ్బు అంతా మొత్తం 21 బ్యాంకు ఖాతాలకు మారిందని పోలీసులు వివరించారు. చివరకు తాము 13 లక్షల రూపాయలను మాత్రమే బ్లాక్ చేయగలిగామని తెలిపారు. మోసగాళ్లు ఖమర్ జహాన్‌కు ఫోన్ చేసి అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే 10 రోజుల పాటు ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్పారని, డబ్బులు వేయించుకున్నారని పోలీసులు చెప్పారు. ఇటువంటి ఫోన్ కాల్స్ వస్తే నమ్మకూడదని పోలీసులు చెబుతున్నారు.
బోర్డు పరీక్షల్లో మార్కులను తప్పుగా లెక్కపెట్టిన టీచర్.. 30 మార్కులు తగ్గడంతో విద్యార్థి ఫెయిల్