Road Accident : ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

అంత్యక్రియలకు వెళ్లివస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బీహార్‌లోని జుమైలో మంగళవారం చోటుచేసుకుంది.

Road Accident : ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

Road Accident (3)

Updated On : November 16, 2021 / 10:37 AM IST

Road Accident : అంత్యక్రియలకు వెళ్లివస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బీహార్‌లోని జుమైలో మంగళవారం చోటుచేసుకుంది. జుమైలోని ఖైరా బ్లాక్‌లోని నౌదిహాకు చెందిన కొందరు దహన సంస్కారాల కోసం పాట్నా వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా పిప్రా గ్రామ శివారుల్లో కారును ట్రక్కు ఢీకొంది.

చదవండి : Road Accident : రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా-ఎస్సై భార్య మృతి

రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఆరుగురు అక్కడిక్కడడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతులు, క్షగాత్రుల బందువులకు సమాచారం అందించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

చదవండి : Road Accident : సంగారెడ్డి జిల్లాలో విషాదం..టిప్పర్ ఢీకొని ఒకరు మృతి