Luck turned overnight: అదృష్టం అంటే ఇతనిధే: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కశ్మీర్ వ్యక్తి

యువకుడు ఆన్ లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్ ఫామ్ "డ్రీమ్ 11"లో రూ.2 కోట్లు గెలుచుకోవడం ద్వారా రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యాడు.

Luck turned overnight: అదృష్టం అంటే ఇతనిధే: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కశ్మీర్ వ్యక్తి

Dream

Updated On : May 22, 2022 / 6:48 PM IST

Luck turned overnight: అదృష్టం ఎప్పుడో కానీ తలుపుతట్టదు. ఆ తట్టిన నాడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా వదిలిపెట్టి పోదు. మిగతా అంశాల్లో ఎలా ఉన్నా..బెట్టింగ్ వంటి విషయాల్లో మాత్రం అదృష్టం ఉంటేనే ధనలక్ష్మి కరుణిస్తుంది. ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహించిన ఓ నిరుపేద కశ్మీర్ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. దక్షిణ కాశ్మీర్ లోని బిజ్ బెహరా ప్రాంతానికి చెందిన యువకుడు ఆన్ లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్ ఫామ్ “డ్రీమ్ 11″లో రూ.2 కోట్లు గెలుచుకోవడం ద్వారా రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యాడు. జమ్ముకశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాలోని షల్గామ్ గ్రామానికి చెందిన వసీం రజా “డ్రీమ్ 11″లో రూ.2 కోట్లు గెలుపొందారు. ఈసందర్భంగా వసీం మాట్లాడుతూ శనివారం రాత్రి తాను నిద్రపోతున్నానని, కొంతమంది స్నేహితులు తనకు ఫోన్ చేసి డ్రీమ్ 11లో మొదటి స్థానంలో ఉన్నానని చెప్పారని, ఆ తర్వాత తాను రూ.2 కోట్లు గెలుచుకున్నాననే విషయాన్నీ గ్రహించానని మీడియాతో చెప్పారు.

Other Stories:Boy Falls In Borewell: 300 అడుగుల బోరుబావిలో ఆరేళ్ల బాలుడు

ఈ వార్త బయటకు రావడంతో, స్థానికులు, స్నేహితులు వసీంను అతని కుటుంబ సభ్యులను అభినందించడం ప్రారంభించారు. “డ్రీమ్ 11″ ప్లాట్ ఫామ్ లో గత రెండేళ్లుగా ఐపీఎల్ ఫాంటసీ జట్లను సృష్టించడం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నానన్న వసీం రజా..”రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావడం అనేది ఒక కలలా అనిపించిందని అన్నారు. ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన తాము ఇకపై పేదరికాన్ని అధిగమించడానికి ఈ డబ్బు సహాయపడుతుంది” అని అన్నారు.

Other Stories:Whatsapp Backup : మీ వాట్సాప్‌లో చాట్, ఫొటో డేటా ఆటో బ్యాకప్ తీసుకోండిలా..!

రూ. 2 కోట్లు నగదు గెలుపొందడంపై ఆనందం వ్యక్తం చేసిన వసీం, గత కొన్ని రోజులుగా తన తల్లి అనారోగ్యంతో ఉందని, ఇప్పుడు ఆమెకు వెంటనే చికిత్స చేయిస్తానని చెప్పుకొచ్చారు. వసీం రజాను అభినందించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. “డ్రీమ్ 11” అనేది ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్. మొబైల్ లో ఫాంటసీ క్రికెట్, హాకీ, ఫుట్ బాల్, కబడ్డీ మరియు బాస్కెట్ బాల్ వంటి ఆటలు ఆడొచ్చు. ఏప్రిల్ 2019లో యునికార్న్ హోదా సాధించిన మొదటి భారతీయ గేమింగ్ కంపెనీగా డ్రీమ్ 11 అవతరించింది.