ఫస్ట్ టైం : రూ.20 కాయిన్ వచ్చేస్తోంది

ఫస్ట్ టైం : రూ.20 కాయిన్ వచ్చేస్తోంది

నోట్లు మారడం.. చిన్న చిన్న నోట్లన్నీ పోయి కొత్త రంగులతో పెద్ద నోట్లు వచ్చాయి. నోట్లలోనే కాదు.. కాయిన్లలోనూ మార్పులు చేసిన భారత ప్రభుత్వం. కొద్ది రోజుల ముందు రూ.10నాణెంతో తెచ్చిన మార్పుతో పాటు సంచలనంగా రూ.20నాణెంతో మన ముందుకు రాబోతుంది. భారత్‌లో రూ.20 నాణెం విడుదల చేయనున్నట్లు బుధవారం ఆర్థిక శాఖ వెల్లడించింది. 
Also Read : ఈ లోకంలో లేడు : PubG ఆడుతూ.. నీళ్లకు బదులు యాసిడ్ తాగాడు

అచ్చం రూ.10 నాణెం ఉన్న సైజులోనే అంటే 27 మి.మీ వ్యాసార్థంతో తయారు కాబోతున్నా.. అంచుల్లో మాత్రం ఎలాంటి గుర్తులు మాత్రం ఉండవు. కానీ, పది రూపాయల నాణెంలానే కాయిన్ రెండు రంగుల్లో కనిపించనుంది. బయటికి ఉండే రింగ్ 65 శాతం కాపర్, 15 శాతం జింక్, 20 శాతం నికెల్ తో ఉండనుంది. నాణెం లోపలి భాగం 75శాతం కాపర్‌తో, 20శాతం జింక్, 5 శాతం నికెల్ తో తయారు చేయనున్నారు.

ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఇంతకుమించిన వివరాలేమీ పొందుపరచలేదు. సరిగ్గా పదేళ్ల క్రితం మార్చి 2009లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది రూపాయల నాణేన్ని ప్రకటించింది. ఆ తర్వాత 13సార్లు మార్పులు చోటు చేసుకుంటూ మార్కెట్ లోకి విడుదల అవడంతో పబ్లిక్ కు అది ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. కొందరైతే అది ఫేక్ కాయిన్ అని దానిని తీసుకోవడం కూడా మానేస్తున్నారు. నోట్లు అయితే ఎక్కువ కాలం మన్నవు కాబట్టి కాయిన్ లు విడుదల చేయడంపైనే ఎక్కువ ఆసక్తి పెట్టినట్లు ఆర్బీఐ అధికార ప్రతినిధి సమావేశంలో వెల్లడించారు. 
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం