Sergei Lavrov : యుక్రెయిన్ సంక్షోభం.. భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి.. రెండు రోజులు పర్యటన!
Sergei Lavrov : రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ భారత్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మంత్రి సెర్గీ ఢిల్లీకి రానున్నరు.

Sergei Lavrov Russia Foreign Minister Visits India Two Days Tour As Ukraine War Continues
Sergei Lavrov : ఒకవైపు యుక్రెయిన్ సంక్షోభం కొనసాగుతోంది. దేశంపై దండెత్తి వచ్చిన రష్యాతో యుక్రెయిన్ విరోచితంగా పోరాడుతోంది. రష్యా కవ్వింపు చర్యలకు తలొగ్గకుండా దీటుగా రష్యా బలగాల ప్రయత్నాలను తిప్పికొడుతోంది. నెలకు పైగా రష్యా యుక్రెయిన్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ యుక్రెయిన్ ఎక్కడా ఛాన్స్ ఇవ్వడం లేదు. ష్యా, యుక్రెయిన్ మధ్య శాంతిచర్చలు కొనసాగుతున్నప్పటికీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ భారత్‌లో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మంత్రి సెర్గీ ఢిల్లీకి రానున్నరు. యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా మంత్రి భారత్ లో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
గురు, శుక్రవారాల్లో సెర్జీవ్ దేశంలోని కీలక నేతలు, విదేశాంగ శాఖ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా రష్యా మంత్రి సెర్జీ యుక్రెయిన్, భారత్ మధ్య ప్రధానంగా యుక్రెయిన్, రష్యా సంక్షోభ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 11న భారత్, అమెరికా మంత్రుల మధ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ముందే రష్యా మంత్రి భారత్‌లో పర్యటించనున్నారు. లావ్రోవ్ భారత్ వస్తున్న సమయంలోనే యూకే విదేశాంగ శాఖ సెక్రటరీ లిజ్ ట్రస్, యూఎస్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ దలీప్ సింగ్ భారత్‌కు రానున్నారు.

Sergei Lavrov Russia Foreign Minister Visits India Two Days Tour As Ukraine War Continues
రష్యా ముడి చమురు ధరలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వాటిని కొనుగోలు చేయడానికి ఎంపికలను అన్వేషిస్తున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. పాశ్చాత్య దేశాలు మాస్కోపై ఆంక్షల మధ్య భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యానికి రూపాయి-రూబుల్ చెల్లింపు విధానాన్ని రూపొందించడం వంటివి లావ్‌రోవ్‌తో చర్చించే అవకాశం ఉంది. మాస్కో ద్వారా సైనిక పరికరాలు, S-400 క్షిపణి వ్యవస్థల భాగాలను సకాలంలో పంపిణీ చేయడంపై కూడా భారత్ చర్చించే అవకాశం ఉంది.
గత నెల రోజులకుపైగా యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగిస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లింది. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో పలుమార్లు తీర్మానాలు ప్రవేశపెట్టారు. భారత్ మాత్రం ఈ తీర్మానాలకు దూరంగా ఉంటోంది. భారత్ ఎప్పటినుంచో యుద్ధానికి వ్యతిరేకమని చెబుతూ వస్తోంది. అయితే ఏదైనా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. మాస్కోపై చర్యలు తీసుకునే విషయంలో భారత్ వైఖరిపై అమెరికా అసహనం వ్యక్తం చేస్తోంది.
అయితే ఈ విషయంలో ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ.. దేశ ప్రయోజనాలకే కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే రష్యా నుంచి డిస్కౌంట్‌లో చమురు కొనుగోలు చేసింది. ప్రస్తుత యుద్ధం, ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పాశ్చాత్య దేశాల ఆంక్షలు రష్యాను ఇబ్బందిపెడుతున్న సమయంలో భారత్ నుంచి రష్యాకు మరింత సహకారం అందాల్సి ఉంది. ఇప్పటికే సెర్జీవ్ చైనా పర్యటన ముగించుకున్నారు.
Read Also : Ukraine – Russia War : టర్కీ టాక్స్ సక్సెస్.. యుక్రెయిన్ - రష్యా యుద్ధం ఇక ముగిసినట్టే..!