Shivamogga : దారుణం .. పొరపాటున మరో వ్యక్తిని హత్యచేసిన సుఫారీ గ్యాంగ్

ఓ వ్యక్తిని హత్య చేసేందుకు సుఫారీ తీసుకున్న గ్యాంగ్ పొరపాటున మరో వ్యక్తిని హత్యచేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది.

Shivamogga : దారుణం .. పొరపాటున మరో వ్యక్తిని హత్యచేసిన సుఫారీ గ్యాంగ్

Prakasam District Double Murder

Updated On : October 19, 2021 / 8:08 AM IST

Shivamogga :  ఓ వ్యక్తిని హత్య చేసేందుకు సుఫారీ తీసుకున్న గ్యాంగ్ పొరపాటున మరో వ్యక్తిని హత్యచేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివమొగ్గలో ఇద్దరు వ్యక్తిలో మధ్య కొద్దీ రోజుల క్రితం ఘర్షణ జరిగింది. ఈ ఘటనను మనసులో పెట్టుకొని ప్రత్యర్థిని హత్య చేయాలనీ పథకం పన్నాడు. ఇందుకోసం ఓ గ్యాంగ్ కి సుఫారీ ఇచ్చాడు. చంపాలి అనుకునే వ్యక్తి అవెంజర్ బైక్ పై వస్తాడని సుఫారీ గ్యాంగ్ కి తెలిపాడు.

చదవండి : Double Murder In Prakasam District : వైద్యం పేరుతో అత్యాచారం చేసిన భూత వైద్యుడు… బాధితురాలు, భూతవైద్యుడు హత్య

అదే సమయంలో సంతోష్ (32) అనే వ్యక్తి తన స్నేహితుడి ఇంట్లో భోజనం చేసి కింద పార్క్ చేసిన అవెంజర్ బైక్ వద్దకు వచ్చి నిల్చున్నాడు. అతడే తాము హత్యచేయాల్సిన వ్యక్తి అని భావించిన సుఫారీ గ్యాంగ్ కత్తులతో దాడి చేసింది. దీంతో సంతోష్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సుఫారీ గ్యాంగ్ ని అదుపులోకి తీసుకోని వివరాలు సేకరించారు. వారికీ సుఫారీ ఇచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకోని ప్రశ్నించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటన అక్టోబర్ 16తేదీ జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

చదవండి : Extrta Marital Affair Murder : యువకుడ్ని హత్యచేసి… శవం పోలీసు స్టేషన్‌లో అప్పగించి లొంగిపోయిన నిందితులు