ఇక్కడ కాదులేండీ : ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక

ఆర్టీసీ ఉద్యోగులకు ముందే దీపావళి పండుగ వచ్చేసింది. వారి వేతనాలు భారీగా పెరిగాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు లెండి. పక్కనే ఉన్న గుజరాత్ రాష్ట్రంలో. అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీపావళి సంబరం ముందే వచ్చేసిందని కార్మికులు పండుగ చేసుకుంటున్నారు. వేతనాలు పెంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. వీరి జీతాలను రెట్టింపు చేస్తున్నట్లు అక్టోబర్ 15వ తేదీ మంగళవారం నిర్ణయం తీసుకుంది.
గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (GSRTC) స్థిర వేతనం పొందుతున్న 12 వేల 692 మందికి ఇది వర్తిస్తుందని, అక్టోబర్ 16వ తేదీ బుధవారం నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయని ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ప్రకటించారు. వేతనాలు పెంచడం వల్ల ప్రతి సంవత్సరం రూ. 92.40 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించారు.
సీనియర్ క్లాస్ – 3 సూపర్ వైజర్ ఇప్పటి వరకు రూ. 14 వేల 500 తీసుకొనే వారు. ఇప్పుడు రూ. 21 వేతనం పొందుతారు. డ్రైవర్ కమ్ కండక్టర్ తీసుకొనే రూ. 11 వేల వేతనాన్ని రూ. 18 వేలకు పెంచారు. క్లాస్ -4 ఉద్యోగులు రూ. 9 వేల వేతనం తీసుకొనే వారు. ఇప్పుడు రూ. 15 వేల వేతనం పొందుతారు.
Read More : నోరు జారారా.. వ్యూహమా : BJPలో చేరాలంటే యూత్ అయ్యి ఉండాలి