Sampark Kranti Express Name Change : సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ పేరు మార్పు.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరు మార్చింది. అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరును అక్షరధామ్ ఎక్స్ ప్రెస్ గా మార్చింది.

Sampark Kranti Express Name Change : సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ పేరు మార్పు.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

SAMPARK

Updated On : January 3, 2023 / 1:13 PM IST

Sampark Kranti Express Name Change : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరు మార్చింది. అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు పేరును అక్షరధామ్ ఎక్స్ ప్రెస్ గా మార్చింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవో వెల్లడించారు.

స్వామినారాయణ్ సంస్థ అధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామి మహరాజ్ కు నివాళిలర్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు ఢిల్లీ, అహ్మదాబాద్ లోని అక్షరధామ్ దేవాలయాలను కలుపుతుందని తెలిపారు. స్వామినారాయణ సంస్థ చేస్తోన్న సేవలకుగానూ ఇది చిరు కానుకని పేర్కొన్నారు.

India – Bangladesh: భారత్ – బంగ్లాదేశ్ మధ్య ‘మిటాలి ఎక్స్‌ప్రెస్’ రైలు ప్రారంభం

2005లో మార్చి నెలలో అహ్మదాబాద్-ఢిల్లీ మధ్య తొలి సర్వీస్ ప్రారంభం అయింది. ఈ రైలు గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మీదుగా ఢిల్లీకి చేరుకుటుంది. ఈ రైలు 17 గంటల్లో1074 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంది.