Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్ పై వెనక్కి తగ్గిన కేంద్రం..
వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి.
Sanchar Saathi App: సంచార్ సాథీ యాప్ పై కేంద్రం వెనక్కి తగ్గింది. ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్ స్టాలేషన్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్ స్టాలేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్ స్టాలేషన్ పై కేంద్రం వెనక్కి తగ్గింది. స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
ఈ అంశంపై పీఐబీ స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. ”సంచార్ సాథీ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేయదని మొబైల్ తయారీదారులకు కేంద్రం తెలిపింది. ఇది స్వాగతించదగిన పరిణామం. ఈ ప్రకటనతో పాటు వచ్చే చట్టపరమైన ఉత్తర్వు పూర్తి వివరాల కోసం మేము ఎదురు చూస్తున్నాము” అని తెలిపింది.
దేశంలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లలో సంచార్ సాథీ సైబర్ సెక్యూరిటీ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వును ప్రభుత్వం బుధవారం వెనక్కి తీసుకుంది. అయితే, యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వినియోగదారుల సంఖ్య (24 గంటల్లో 6 లక్షలకు పైగా..మొత్తం 1.4 కోట్ల మంది వినియోగదారులు) వేగంగా పెరిగింది.
“పౌరులందరికీ సైబర్ భద్రతను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అన్ని స్మార్ట్‌ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఈ యాప్ సురక్షితమైనది. సైబర్ నేరాల నుండి పౌరులకు సాయం చేయడానికి ఉద్దేశించబడింది” అని కేంద్రం తెలిపింది.
అయితే, యాప్ ప్రీ-ఇన్‌స్టాలేషన్ ఆదేశం గోప్యతా హక్కులను ఉల్లంఘిస్తుందని.. ఆ యాప్ ను ప్రజలపై నిఘా పెట్టడానికి ఉపయోగించవచ్చనే ప్రతిపక్షాల ఆందోళనలతో కేంద్రం దిగి వచ్చింది. యాప్ ప్రీ ఇన్ స్టాలేషన్ మస్ట్ అన్న ఆదేశాన్ని ఉపసంహరించుకుంది.
సంచార్ సాథీ యాప్ అంటే ఏమిటి?
ఇదొక సైబర్ సేప్టీ యాప్. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) అభివృద్ధి చేసిన భద్రత, అవగాహన వేదిక. దీన్ని యాండ్రాయిడ్, యాపిల్ పరికరాలు రెండింటికీ అందుబాటులో ఉన్న యాప్‌గా, వెబ్ పోర్టల్‌గా యాక్సెస్ చేయచ్చు. ప్రజలు తమ డిజిటల్ ఐడెంటీలను మ్యానేజ్ చేయడం, అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడం, వారి పరికరాలను రక్షించడంలో సహాయపడటానికి, అలాగే టెలికాం భద్రత, సైబర్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ యాప్ ని తీసుకొచ్చింది.
