మంచమెక్కని మహనీయుడు: కూర్చునే

  • Published By: veegamteam ,Published On : March 17, 2019 / 08:25 AM IST
మంచమెక్కని మహనీయుడు: కూర్చునే

Updated On : March 17, 2019 / 8:25 AM IST

ఇండోర్: 72 ఏళ్ల వయస్సు..50 సంవత్సరాల సన్యాస జీవితం. 48 ఏళ్లుగా సుఖ నిద్రపోని వ్యక్తి..అతనే జైన సాధువు..సంత్‌శీతల్‌రాజ్ మహరాజ్. సుఖనిద్ర ఆరోగ్యాన్ని పెంచుతుందనేది నిపుణులు చెబుతున్న మాట. కానీ గత 48 సంవత్సరాలుగా అస్సలు మంచం మీద పడుకోకుండా కేవలం కూర్చునే నిద్రపోతున్న జైన సమాజంలోని సాధువు శ్వేతాంబర జైన సమాజానికి చెందిన సంత్‌శీతల్‌రాజ్ మహరాజ్. ఆయన్ని చూస్తే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు. 

ఆయన  తన 50 ఏళ్ల సన్యాస జీవితంలో 48 ఏళ్లుగా సుఖ నిద్రను త్యజించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 72 ఏళ్ల శీతల్ మహరాజ్ ఒక క్షణం కూడా మంచం మీద కూర్చోలేదని చెబుతుంటారు తోటి సాధువులు. కేవలం కుర్చీమీద కూర్చొనే నిద్రపోతారట.ఈ విధంగా సుఖ నిద్రను త్యజించిన జైన మునులలో ఈయన రెండవ వ్యక్తి అని అంటారు జైన సాధువులు. 
 

జైన సమాజంలో పలువురు సాధువులు శీతల్ మహరాజ్ లా ఉండాలని ప్రయత్నించి విఫలమయ్యారట. సంత్‌శీతల్ మహరాజ్ జోధ్‌పూర్‌నకు చెందిన ఆచార్య హస్తీమల్జీ నుంచి దీక్ష తీసుకున్నారు. గత 26 ఏళ్లుగా శీతల్ మహరాజ్ సూర్యారాధనను కొనసాగిస్తు..12 నుంచి 2 గంటల మధ్యకాలంలో ఆయన సూర్య కిరణాల నుంచి వచ్చే వేడిని (తాపాన్ని)స్వీకరిస్తారు. ఈ క్రమంలో ప్రతీ సోమవారం..గురువారం రోజుల్లో పూర్తిమౌనం పాటిస్తారట. కాగా 48 ఏళ్ల నుంచి పూర్తిగా నిద్రపోకున్నా..ఆయన పూర్తి ఆరోగ్యం ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.