సుప్రీంలో కార్తీ చిదంబరానికి ఊరట

  • Published By: chvmurthy ,Published On : January 17, 2020 / 12:53 PM IST
సుప్రీంలో కార్తీ చిదంబరానికి ఊరట

Updated On : January 17, 2020 / 12:53 PM IST

ఐఎన్ ఎక్స్ మీడియా , ఎయిర్ సెల్ మ్యాక్సిస్  మనీ  ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న కార్తీచిదంబరంకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.  సుప్రీం కోర్టులోడిపాజిట్ చేసిన 20 కోట్ల  రూపాయలను విత్ డ్రా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

కార్తీ విదేశాల‌కు వెళ్లేందుకు రూ. 20 కోట్ల డిపాజిట్ తీసుకుని ఆ ప‌ర్మిష‌న్ ఇచ్చింది. అయితే ఆ డిపాజిట్ సొమ్మును విత్‌డ్రా చేసుకోవ‌డంలో ఎటువంటి అభ్యంత‌రం లేద‌ని జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం శుక్రవారం స్ప‌ష్టం చేసింది. 2019 జ‌న‌వ‌రి, మే నెల‌ల్లో.. కార్తీ చిదంబ‌రం ప‌దేసి కోట్లు చొప్పున రెండు సార్లు  కోర్టులో నగదు డిపాజిట్ చేశారు.