రైతుల ఆందోళన…మరో తబ్లిగీ జమాత్!

రైతుల ఆందోళన…మరో తబ్లిగీ జమాత్!

Updated On : January 7, 2021 / 8:46 PM IST

Tablighi Jamaat event నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతుండటం..చలి ఎక్కువగా ఉండటంతో రైతులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. రైతులు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నారో.. లేదోనని.. ఒకవేళ పాటించకుంటే గతేడాది ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ ఈవెంట్ మాదిరిగానే ఈ ఉద్యమాలు మారే ప్రమాదం ఉన్నదని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

కేంద్రం, రైతుల మధ్య చర్చలలో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. కోవిడ్-19 సమయంలో తబ్లిగీ జమాత్ కు అనుమతించిన అధికారులపై చర్యలు కోరుతూ దాఖలైన దాఖలైన పిటిషన్ పై భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బోబ్డె నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సోలిసిటర్ జజనరల్ తుషార్ మొహతాని సీజీఐ ఎస్ఏ బోబ్డే ఈ విధంగా అడిగారు…రైతుల ఆందోళన నుంచి కూడా అదే సమస్య ఉత్పన్నమయేలా కనిపిస్తున్నది. వాళ్లందరూ కోవిడ్-19 నుంచి రక్షణ పొందుతున్నారో లేదో తెలియదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మీరు మాకు కచ్చితంగా తెలియజేయాలని కోర్టు కోరింది.

తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ..మీ అనుభవం నుంచి పాఠం నేర్చుకున్నారా అని సోలిసిటర్ జనరల్ ని సీజేఐ ప్రశ్నించారు. దీనికి సొలిసిటర్ జనరల్ మెహతా స్పందిస్తూ.. ‘అలాంటిదేమీ లేదు’ అని..దీనిపై తాను వివరాలు తెప్పించుకుని కోర్టుకు తెలియజేస్తానని ఆయన తెలిపారు. కాగా, దేశంలో అప్పటిదాక దేశంలో ఓ మోస్తారు స్థాయిలో నమోదవుతున్న కేసులు..మార్చిలో తబ్లిగీ ఈవెంట్ తర్వాత భారీ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. అంతేగాక పలు రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి అంతగా లేకున్నా..తబ్లిగీ ఈవెంట్ తర్వాత ఒక్కసారిగా పెరిగాయి.