Road Accident Two Killed : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా, ఇద్దరు విద్యార్థులు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.

Road Accident Two Killed : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా, ఇద్దరు విద్యార్థులు మృతి

Two students killed

Updated On : December 12, 2022 / 6:50 AM IST

Road Accident Two Killed : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు బోల్తా పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

రాయ్ గఢ్ జిల్లాలోని కొపోలీలో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా పడింది. హైవే పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 48 విద్యార్థులు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మరణించారు. మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.