కుంభమేళాతో సంపూర్ణ ఆరోగ్యం
అదో అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం… ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ధార్మిక సమ్మేళనం… కోట్లాదిమంది ఒక్కచోట చేరే అద్భుత ఘట్టం.. పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య సమయం.. అదే కుంభమేళా. ఈ మహోత్సవం వెనుక భక్తి, ఆధ్యాత్మిక భావమే కాదు.. సైన్స్ కూడా ఉంది. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.
కుంభమేళాకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) సిద్ధమవుతోంది. 2019, జనవరి 15 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే ఈ మేళాలో లక్షలాదిమంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తారు. భక్తుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలికంగా ఒక నగరాన్నే నిర్మిస్తోంది. కుంభమేళాకు దేశ విదేశాల నుంచి 12 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. కుంభమేళాకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మహోత్సవం వెనుక భక్తి భావం, ఆధ్యాత్మికత మాత్రమే కాదు.. సైన్స్ కూడా ఉంది.
కుంభమేళాపై అనేక పరిశోధనలు జరిగాయి. తమ రీసెర్చ్‌లో బయటపడిన విషయాలు వైద్య రంగాన్ని అబ్బురపరిచాయి. కుంభమేళా వల్ల కలిగే లాభాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కుంభమేళాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తేలింది. ఎంతో భక్తిశ్రద్దలతో చేసే నదీస్నానాలతో ఆరోగ్యం మరింత మెరుగవుతుందని పరిశోధనల్లో తేలింది.
* కుంభమేళా వెనుక సైన్స్
* సంపూర్ణ ఆరోగ్యం సొంతం
* నదీ స్నానాలతో రోగ నిరోధక శక్తి పెంపు
* ఆనందం పెరుగుతుంది
* ఒత్తిడి తగ్గుతుంది
* సహజసిద్ధంగానే రోగాలు తగ్గిపోతాయి
* యాంటీబాండీస్ పెరుగుతాయి