రెండో దశ మలబార్ విన్యాసాలు ప్రారంభం

Second phase of Malabar exercise begins రెండవ దశ మలబార్-2020 నావికదళ విన్యాసాలు ఇవాళ(నవంబర్-17,2020)ఉత్తర అరేబియా సముద్రంలో ప్రారంభమయ్యాయి. భారత్ తోపాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలకు చెందిన యుద్ధనౌకలు ఇందులో పాల్గొన్నాయి. భారత అమ్ముల పొదిలోని ప్రధాన అస్త్రం ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎన్ఎస్ నిమిట్జ్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌కు చెందిన యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద యుద్ధనౌక యూఎన్ఎస్ నిమిట్జ్ ఈ విన్యాసాల్లో పాల్గొనడం ప్రత్యేకంగా నిలుస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. చతుర్భుజ కూటమిలో భాగమైన ఈ నాలుగు దేశాలు సంయుక్తంగా నిర్వహించే ఈ విన్యాసాల వల్ల పరస్పర సమన్వయం పెరుగుతందని భారత నావికాదళం ప్రకటించింది.
కాగా, మలబార్ మొదటి దశ విన్యాసాలు ఈ నెల 3- 6 వరకు బంగాళాఖాతంలో జరగగా.. రెండో దశలో జరుగుతున్న ఈ విన్యాసాలు నవంబర్-20,2020 వరకూ కొనసాగనున్నాయి.