Maoists Bunker : సుక్మా జిల్లాలో బయటపడ్డ మావోయిస్టుల సొరంగం.. అందులో ఏముందో చూసి షాక్ తిన్న జవాన్లు..!
అబూజ్ మడ్ మావోయిస్టులకు కీలకమైన ప్రాంతం కావడంతో అక్కడున్న నాయకత్వాన్ని సేఫ్ జోన్ లో ఉంచేందుకు బంకర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Maoists Bunker : ఛత్తీస్ గడ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల సొరంగం బయటపడింది. సుక్మా బీజాపూర్ సరిహద్దులో కూంబింగ్ చేస్తుండగా డీఆర్జీ జవాన్లు సొరంగాన్ని గుర్తించారు. బాంబుల తయారీ కోసం ఉపయోగించే పదార్ధాలను స్వాధీనం చేసకున్నారు. తుమ్రేల్, తల్పేరు నదుల మధ్య ఈ సొరంగం ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు.
సొరంగంలో బాంబులు, ఐఈడీల తయారీ..
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఎదురుకాల్పులు, కూంబింగ్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. అదే స్థాయిలో జవాన్లను ఎదుర్కొనేందుకు మావోయిస్టులు కూడా నూతన పంథాను ఎంచుకున్నట్లు చెప్పొచ్చు. సుక్మా బీజాపూర్ సమీపంలో ఉన్న తుమ్రేల్, తల్పేర్ నదీ పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక సొరంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
అందులో బాంబులు, ఐఈడీలను తయారు చేసేందుకు పెద్ద ఎత్తున సామాగ్రిని (ఐరన్ వైర్, బాటిల్స్) దాచినట్లు గుర్తించారు జవాన్లు. దాదాపు కిలోమీటర్ పైగా సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు మావోలు.
జవాన్ల కూంబింగ్ వేగవంతంగా సాగుతున్న నేపథ్యంలో ప్రాణాలను కాపాడుకునేందుకు మావోయిస్టులు బంకర్లను ఏర్పాటు చేసుకుని వాటిలో తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, సొరంగంలో టన్నుల కొద్దీ వైరింగ్ ను గుర్తించారు జవాన్లు.
బంకర్లను గుర్తించే పనిలో జవాన్లు..
అబూజ్ మడ్ మావోయిస్టులకు కీలకమైన ప్రాంతం కావడంతో అక్కడున్న నాయకత్వాన్ని సేఫ్ జోన్ లో ఉంచేందుకు బంకర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. జవాన్లు.. కూంబింగ్ లో భాగంగా బంకర్లను గుర్తించే పనిలో పడ్డారు. గత నెలలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో దాదాపు అర కిలోమీటర్ పైనున్న సొరంగాన్ని జవాన్లు కనుగొన్నారు.
నిన్న పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు బంకర్ బయటపడింది. సొరంగంలోకి వెళ్లిన జవాన్లు.. అది ఎంత పెద్దదిగా ఉంది అనేది పరిశీలించారు. అందులో ఏమేం ఏర్పాటు చేసుకున్నారో తెలుసుకున్నారు. తాజా ఘటనతో జవాన్లు మరింత అప్రమత్తం అయ్యారు. కూంబింగ్ ను ముమ్మరం చేశారు. మరిన్ని బంకర్లు కనుగొనే పనిలో పడ్డారు. మరోవైపు కూంబింగ్ నిర్వహించే జవాన్లు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు.
Also Read : మొన్న బెదిరింపు కాల్, నిన్న నకిలీ పోలీస్, ఇప్పుడు డ్రోన్.. పవన్ కల్యాణ్ చుట్టూ అసలేం జరుగుతోంది?